Kubera

Kubera: శేఖర్ కమ్ముల మాయాజాలం.. కుబేరకి భారీ రన్‌టైమ్‌..!

Kubera: తమిళ హీరో ధనుష్, రష్మిక మందన్నా జంటగా, కింగ్ నాగార్జున కీలక పాత్రలో దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “కుబేర”. ధనుష్ కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌గా, శేఖర్ ఫిల్మోగ్రఫీలోనూ భారీ బడ్జెట్ సినిమాగా రూపొందుతోంది. ఇప్పుడు ఈ చిత్రం తుది దశలో ఉండగా, రన్‌టైమ్‌కు సంబంధించిన ఆసక్తికర విషయం బయటకొచ్చింది.

శేఖర్ కమ్ముల సినిమాలు సాధారణంగా కాస్త పొడవైన రన్‌టైమ్‌తోనే ఆకట్టుకుంటాయి. అయితే, “కుబేర” మాత్రం అంతకు మించి 3 గంటల 15 నిమిషాల రన్‌టైమ్‌తో రాబోతున్నట్టు సమాచారం. ఇంత పెద్ద రన్‌టైమ్‌ ఉన్న సినిమాలు గతంలో థియేటర్లలో ప్రేక్షకులను కట్టిపడేసిన సందర్భాలున్నాయి.

Also Read: Akhanda 2: బాలయ్య-బోయపాటి తాండవం.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న అఖండ 2 టీజర్!

Kubera: కానీ, ఇంత గంటలపాటు ప్రేక్షకులను ఆకట్టుకోవడం “కుబేర”కు పెద్ద సవాలే.
మేకర్స్ ఈ సినిమాను ఎంగేజింగ్‌గా తీర్చిదిద్దారా? లేక కొంచెం లోటుపడిందా? అనేది జూన్ 20న విడుదలైన తర్వాతే తేలనుంది. శేఖర్ కమ్ముల మార్క్ కథ, ధనుష్-నాగార్జున నటనతో “కుబేర” ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుందా? వేచి చూద్దాం!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mahaa Vamsi: హత్య తో వివేకా హత్య.. అప్రూవర్ గా A2 సునీల్ ఫినిష్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *