Sanju Samson: ఐపీఎల్ 2025 ముగిసి వారం రోజులు అయిపోయింది. అయితే ఐపీఎల్ గురించి ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు సామ్సన్ ఐపీఎల్‌లో జట్టును వీడతాడని పుకార్లు వచ్చాయి. ఇప్పుడు, ఆ పుకారును నిర్ధారించే పోస్ట్‌ను సంజు సామ్సన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు సామ్సన్ జట్టును వీడే అవకాశం ఉంది. ఈ ఐపీఎల్ సీజన్‌లో సంజు ఇంపాక్ట్ సబ్‌గా కొన్ని మ్యాచ్‌లు ఆడాడు. గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లలో ఆడలేకపోయాడు. సంజు సామ్సన్ లేకపోవడంతో, ర్యాన్ పరాగ్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు నాయకత్వం వహించాడు. ప్రస్తుతం సంజు సామ్సన్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ అతను రాజస్థాన్‌ను విడిచిపెడతాడనే ఊహాగానాలకు దారితీసింది.
ఇది కూడా చదవండి: Nicholas Pooran Retirement: పూరన్ షాకింగ్ నిర్ణయం..అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై !
సంజు సామ్సన్ తన భార్యతో కలిసి రోడ్డు దాటుతున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫోటోకు “ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైంది” అని క్యాప్షన్ ఇచ్చాడు. సంజు ఫోటోపై అభిమానులు కామెంట్ చేస్తూ, అతను రాజస్థాన్ నుంచి వెళ్లిపోతున్నాడని అంటున్నారు. అంతే కాదు, వచ్చే సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అతను కనిపిస్తాడని కూడా చెబుతున్నారు.
ఈ ఐపీఎల్ సీజన్‌లో సంజు సామ్సన్ 9 మ్యాచ్‌లు ఆడి 140.39 స్ట్రైక్ రేట్ తో 35.63 సగటుతో 285 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్రదర్శన నిరాశపరిచింది. 14 మ్యాచ్‌లలో రాజస్థాన్ 4 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచి 10 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. రాజస్థాన్ పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది.