Bulli Raju: ఎఫ్ 2, ఎఫ్ 3 వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ వచ్చిన మూడో సినిమా సంక్రాంతికి వస్తునాం సినిమా ఇటీవలే జనవరి 14న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయినా సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.
బాక్స్ ఆఫీస్ వద్ద ఇతర సినిమాల తాకిడిని ఎదురుకుంటూ భారీ వాసులని రాబడుతుంది. ఇప్పటికే 130 కోట్లు కలెక్ట్ చేసి 150 కోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. సినిమాలో వెంకటేష్ కొడుకు బుల్లిరాజు పాత్ర పోషించిన భీమల రేవంత్ పవన్ సాయి సుభాష్. వెంకటేష్ కి ఈ బుడోడికి మధ్య వచ్చే సన్నివేశాలకి థియేటర్ లో అందరూ పగలబడి నవ్వుకుంటున్నారు. ముఖ్యంగా గోదారి యాసలో ఈ పిల్లాడు చెప్పే డైలాగులకు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. ఇది ఇలా ఉంటె తాజాగా రేవంత్ భీమల ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
బీమవరం కి చెందిన రేవంత్ భీమల. పవన్ కళ్యాణ్ కి వయస్సుతో సంబంధం లేకుండా ఫాన్స్ ఉంటారు అలాగే ఈ పిల్లాడు కూడా అయన ఫ్యాన్ అంట. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ భీమల జనసేన తరపున ప్రచారం కూడా చేశాడు అంట ఈ విషయం తనే చెప్పుకొచ్చాడు.. సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూ మాట్లాడుతూ.. ‘తను పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్ అని . అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేనకు క్యాంపైన్ కూడా చేశాను. అన్ని ఇళ్లకు బ్యాలెట్ పేపర్లు పట్టుకొని ఓటు వేయాలని తిరిగాను. ఆలా ప్రచారం చేసినపుడు తీసిన వీడియో ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేయగా అది వైరల్ గ మారింది.. దాని చుసిన దిల్ రాజు, అనిల్ రవిపూడి, ఆడిషన్స్ కి పిలిచారు తర్వాత ఒక సీన్ ఇచ్చి చేయమన్నారు. నేను చేసిన యాక్టింగ్ నచ్చడంతో నను సినిమాలోకి తీసుకున్నారు అని తెలిపాడు.
సంక్రాంతికి వస్తున్న ఫేమ్ బుల్లి రాజు గారు ఇటీవలి ఎన్నికల్లో #NDA కూటమి కోసం చురుకుగా ప్రచారం చేశారు 😳🔥💥#JoharNTR#NTRLivesOn#BeKindToAnimals#Election2024 #RKBJP #ElectionMemories pic.twitter.com/wVpybW3fXS
— RK/రామకృష్ణ పామర్తి/रामकृष्ण (@RAM2347RK) January 18, 2025