IND vs NZ 3rd Test: మూడో టెస్టులోనూ టీమిండియా తడబాటు..

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌ లో టీమిండియా బ్యాట్స్ మెన్లు తడబడుతున్నారు.ఇరుజట్ల మధ్య శుక్రవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో మూడో చివరి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కివీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా ఆల్ రౌండర్స్ రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ లు చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్ న్యూజిలాండ్ 65.4 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటైంది. కవీస్ బ్యాటర్లలో విల్ యంగ్(71), మిచెల్(82)లు అర్థ శతకాలతో రాణించారు. మిగతా బ్యాట్స్ మెన్లు విఫలమయ్యారు.

ఇక, భారత బౌలర్లలో సుందర్ 4 వికెట్లు, జడేజా 5 వికెట్లు పడగొట్టగా.. ఆకాశ్ దీప్ ఒక వికెట్ తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ కు ఆదిలోనే షాక్ తగిలింది. గత రెండు టెస్టుల్లో ఘోరంగా విఫలమైన కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ మరోసారి తీవ్రంగా నిరాశపర్చాడు. కీలక మ్యాచ్ లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి హెన్రీ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శుభ్ మన్ గిల్ తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్న మరో ఓపెఓనర్ యశస్వీ జైస్వాల్.. కివీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ దూకుడుగా బ్యాటింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జైస్వాల్ కూడా ఔటై వెనుదిరిగాడు.

అయితే, మరికొద్దిసేపట్లో తొలి రోజు ముగియనున్న నేపథ్యంలో మహ్మద్ సిరాజ్ పంపగా.. అతను కూడా ఔట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి విరాట్ కోహ్లీ వచ్చాడు. ఈ మ్యాచ్ లోనైనా కోహ్లీ అడుతాడని అందరూ భావించారు. అనుకున్నట్లే వచ్చిరాగానే కోహ్లీ ఫోర్ బాది మంచి ఊపుమీద కనిపించాడు. అయితే, గిల్ తో సమన్వయ లోపంతో కోహ్లీ(4) రనౌట్ అయ్యాడు.దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి కేవలం 86 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ప్రస్తుతం క్రీజులో గిల్(31), రిషబ్ పంత్(01)లు ఉన్నారు. ఇప్పటికే 2–0తేడాతో టెస్టు సిరీస్ ను న్యూజిలాండ్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లోనైనా గెలిచి పరుపు నిలబెట్టుకోవాలని ఆశించిన టీమిండియాకు కలిసి రావడం లేదు. మరోవైపు ఈ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో కివీస్ ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Harish Rao: సీఎం రేవంత్ వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *