A6 Movie

A6 Movie: స‌ల్మాన్, ర‌జ‌నీ, క‌మ‌ల్ ఒకే ప్రేమ్ లో!

A6 Movie: ‘జవాన్’ హిట్ తో బాలీవుడ్ లో కోలీవుడ్ డైరెక్టర్ అట్ల పేరు మారుమ్రోగుతోంది. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ అందరూ అట్లీతో సినిమా చేయటానికి రెడీ అయిపోయారు. అయితే అట్లీ సల్మాన్ ఖాన్ హీరోగా సినిమా తీయటానికి కమిట్ అయ్యాడు. ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కబోతోందట. సల్మాన్ వారియర్ గా నటించే ఈ మూవీ యాక్షన్, థ్రిల్లర్, డ్రామాగా రూపొందనుందట. ఇద్దరు హీరోల కథగా రాబోతున్న ఈ చిత్రంలో సల్మాన్ తో పాటు మరో దక్షిణాది సూపర్ స్టార్ కూడా హీరో నటిస్తాడట. అంతే కాదు ఆ హీరోతో పాటు మరో స్టార్ హీరో కీలక పాత్రలో మెరవనున్నాడట. దక్షిణాది స్టార్స్ కమల్ హాసన్, రజనీకాంత్ లో ఒకరు మెయిన్ లీడ్ గా మరొకరు కథను మలుపు తిప్పే ఛాలెంజింగ్ రోల్ పోషిస్తారని సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది పట్టాలెక్కనుందట. ప్రస్తుతం సల్మాన్ ‘సికిందర్’లో నటిస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. సల్మాన్, కమల్, రజనీకాంత్ ముగ్గురి డేట్స్ కి అనుగుణంగా అట్లీ సినిమా షెడ్యూల్స్ ని ప్లాన్ చేస్తారట. మరి ఈ ముగ్గురు సూపర్ స్టార్స్ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే అంది ఆడియన్స్ కు పండగే కదా.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Trisha: న్యూయార్క్ టైమ్స్ పజిల్ లో త్రిష!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *