Salman Khan: బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ తన తదుపరి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా గల్వాన్ లోయలో వీరోచితంగా పోరాడిన కల్నల్ బి. సంతోష్ బాబు జీవితం ఆధారంగా రూపొందుతోంది. ఈ బయోపిక్‌ను ప్రముఖ దర్శకుడు రామ్ చరణ్ తో ‘తుఫాన్’ లాంటి ప్లాప్ సినిమాని తీసిన అపూర్వ లఖియా తెరకెక్కిస్తున్నారు. దేశభక్తితో కూడిన ఈ కథలో సల్మాన్ ఖాన్ కల్నల్ సంతోష్ బాబు పాత్రలో నటించనున్నారు.
ఇది కూడా చదవండి: Suresh Raina: సినిమా రంగంలోకి దూసుకొస్తున్న క్రికెట్ స్టార్ సురేష్ రైనా!
2020లో గల్వాన్ లోయలో జరిగిన సంఘర్షణలో భారత సైనికులు చూపిన ధైర్యం, త్యాగాన్ని ఈ చిత్రం ఆవిష్కరించనుంది. సల్మాన్ ఖాన్ ఈ పాత్ర కోసం తీవ్రమైన శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమాతో అతను మరోసారి తన నటనా ప్రతిభను చాటుకోనున్నాడు. ఈ చిత్రం భారతీయ సైన్యం యొక్క గౌరవాన్ని, దేశం కోసం సైనికులు చేసే త్యాగాలను ప్రతిబింబించనుంది. అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం సల్మాన్ ఖాన్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుందని భావిస్తున్నారు.