Kishan reddy: అధికారుల ధోరణి పట్ల కిషన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి

Kishan reddy: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న శ్రీకృష్ణనగర్ బస్తీలో నెలకొన్న సమస్యలను పరిశీలించిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన బస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా సీ-బ్లాక్‌ కమ్యూనిటీ హాల్ వద్ద ఇళ్ల ముందు మురుగునీరు నిల్వ ఉండటం ఆయన గమనించారు.

స్థానికులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని వాపోయారు. ప్రజల పరిస్థితిని చూశాక చలించిపోయిన కిషన్ రెడ్డి, అక్కడి నుంచే జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ఫోన్ చేశారు. “మీ ఇంటి ముందు ఇలాగే మురుగునీరు పారితే మీరెంత కాలం తట్టుకోగలరు?” అంటూ ఆయన అధికారులను ప్రశ్నించారు.

తక్షణ చర్యలు తీసుకుని వారం రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలని కమిషనర్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అధికారుల ధోరణి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి, ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Isro Spadex Mission: ఇస్రో శాటిలైట్ డాకింగ్ ట్రయల్ సక్సెస్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *