Suresh Raina: క్రికెట్ లెజెండ్ సురేష్ రైనా తమిళ సినిమా ద్వారా నటనలోకి అడుగుపెడుతున్నారు. డ్రీమ్ నైట్ స్టోరీస్ ప్రొడక్షన్ హౌస్ నిర్మాణంలో కొత్త డైరెక్టర్ లోగన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కనుంది. ఈ చిత్రానికి స్టార్ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా, యాక్షన్ సన్నివేశాలను సుప్రీమ్ సుందర్ రూపొందిస్తున్నారు. ఆస్కార్ విజేత రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. సినిమాటోగ్రఫీని సందీప్ కె. విజయ్, ప్రొడక్షన్ డిజైన్‌ను టి. ముత్తురాజ్ నిర్వహిస్తున్నారు.
Also Read: Double Centuries: టెస్ట్, వన్డేల్లో డబుల్ సెంచరీలు సాధించిన ఐదుగురు ఆటగాళ్లు వీళ్లే!
Suresh Raina: ఈ సినిమా క్రికెట్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా ఉంటుందని భావిస్తున్నారు. రైనా తన సీఎస్‌కే అనుబంధాన్ని, తమిళనాడు ప్రేక్షకుల ప్రేమను గుర్తుచేస్తూ ఈ ప్రాజెక్ట్‌పై ఉత్సాహం వ్యక్తం చేశారు. ఈ చిత్రం త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. మరి రైనా సినిమా రంగంలో ఎలాంటి విజయాలు సాధిస్తారో చూడాలి.