Sailajanath

Sailajanath:మాజీ మంత్రి శైలజానాథ్ రాజకీయ దారి ఎటు వైపు

Sailajanath: అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం రాజకీయంగా చాలా చైతన్యవంతమైన నాయకులు ఉన్నారని చెప్పవచ్చు.నీలం సంజీవరెడ్డి, తరిమెల నాగిరెడ్డి ఆనాటి కాలంలోనే ఢిల్లీ వరకు శింగనమల పేరును తీసుకెళ్లారు. శింగనమల పునర్విభజన తర్వాత ఎస్సీ రిజర్వుడ్‌గా రూపాంతరం చెందింది. దాదాపు 40 సంవత్సరాలుగా ఎస్సీ సామజిక వర్గం నేతలే పోటీ చేస్తున్నారు. జయరాం, శమంతకమణి, శైలజనాథ్ వంటి నాయకులు ఎమ్మెల్యేలగా గెలిచి మంత్రి పదవులు చేపట్టి రాజకీయాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాలం మారే కొద్ది రాజకీయ పరిణామాలు కూడా వేగంగా మారుతున్నడంతో కొందరు నాయకులు రాజకీయాల నుంచి కనుమరుగయ్యారు. మరికొందరు మాత్రం వారి ఉనికిని చాటుకోవడానికి నియోజకవర్గంలో అడపాదడపా రాజకీయాలు చేస్తున్నారు.

Sailajanath: అందులో మాజీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్ రాజకీయంగా సెకండ్ ఇన్నింగ్స్  మొదలు పెట్టాడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారంట.అయితే ఇప్పటికీ సరైన ప్లాట్ ఫామ్ దొరకట్లేదంట ఆ నాయకుడికి.మాజీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్ శింగనమల నుంచి 2004లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గం అభివృద్ధికి నాంది పలికారు.2009లో కూడా రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడంతో వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్నారు.

ఇది కూడా చదవండి: Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీలో ముంబైని కర్ణాటక ఎడ్జ్ దాటింది

Sailajanath: శింగనమలతో పాటుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మాజీ మంత్రి శైలజనాథ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. శింగనమలకి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి బాట వేశారు. తన రాజకీయం మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కాంగ్రెస్‌ సీనియర్ నాయకులు రఘు వీరారెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి లాంటి వారి మధ్య శైలజనాథ్ రాజకీయం చేశారు. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహం ఏమో తెలియదు గానీ అప్పట్లో జేసీ దివాకర్ రెడ్డి వర్సెస్ శైలజనాథ్ మధ్య రాజకీయంగా ఒక పెద్ద యుద్ధమే జరిగిందని చెప్పవచ్చు. ఇద్దరూ కాంగ్రెస్ నాయకులు అయిన రాజకీయ ఆధిపత్యం కోసం నువ్వా నేనా అనే విధంగా 2009లో వీరిద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే విధంగా రాజకీయ పోరు కొనసాగింది. ఆనాటి కాంగ్రెస్ నాయకులు పరిస్థితి 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత వీరి రాజకీయం గ్రాఫ్ ఒక్కసారి డౌన్ పాల్ అయింది.

Sailajanath: అప్పటి రాజకీయ పరిణామాలు దృష్టిలో పెట్టుకుని కొందరు పార్టీలు మారి సెకండ్ ఇన్నింగ్స్ లో రాజకీయంగా సక్సెస్ అయ్యారు.కొందురు మాత్రం రాజకీయాల్లో రాణించలేక గుడ్ బై చెప్పారు.మాజీ పీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్ సెకండ్ ఇన్నింగ్స్ రాజకీయం ప్రారంభించాలని సుదీర్ఘంగా ఎదురు చూస్తున్నారు.

ALSO READ  MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE

ఇది కూడా చదవండి: Jammalamadugu: జగన్‌కు ప్యాలెస్‌ల ఫాంటసీ…జమ్మలమడుగు ఎమ్మెల్యే

Sailajanath: సరైన ప్లాట్ ఫామ్ దొరకపోవడంతో పది సంవత్సరాలకు పైగా కాంగ్రెస్‌లోనే కొనసాగుతూ వస్తున్నారు. శింగనమలలో తనకంటూ ఒక ప్రత్యేక వర్గం ఉన్నప్పటికీ ప్రస్తుత రాజకీయాల్లో రాణించలేకపోతున్నారంట… 2014, 2019, 2024లో మూడుసార్లు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి డిపాజిట్స్ కూడా దక్కలేదు శైలజనాథ్ కు.. ప్రాంతీయ పార్టీలైన టీడీపీ వైసీపీ తీర్థం పుచ్చుకోవాలని వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న ఎక్కడో బెడిసి కొడుతున్నాయంట ఆ సీనియర్ నాయకుడికి.

Sailajanath: 2024 ఎన్నిలకు ఆరు నెలలు ముందే టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారనేది అప్పట్లో పెద్ద ప్రచారమే జరిగింది.ఇప్పుడు మరోసారి మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శైలజనాథ్ వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది.ఇందు కారణం కర్నూలు జిల్లాలోని ఒక పెళ్లి వేడుకలు ఈ ఇద్దరు నాయకులు కలిసి మాట్లాడుకోవడం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శైలజనాథ్‌ను వైసీపీలోకి ఆహ్వానించినట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది.

ఇది కూడా చదవండి: Youtube: భారత్ లో యూట్యూబ్ కొత్త రూల్స్

Sailajanath: 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత.. జగన్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ఫోకస్ చేశారంట.175 నియోజకవర్గాల్లో వైసీపీ బ్యాక్ బోన్స్ అయ్యే విధంగా పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారంట… ఇక శింగనమలలో వైసీపీని నడిపించే సరైన నాయకుడు లేరంట… మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి 2024లో టికెట్ దక్కకపోవడంతో ఆమె రాజకీయాలకు దూరంగా వెళ్లిపోయారు… ఆలూరు సాంబశివారెడ్డి అంటి ముట్టినట్టే వ్యవహరిస్తున్ననేది టాక్  మొన్న ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు నియోజకవర్గంలో రాజకీయం చేసే శక్తి సామర్థ్యం లేవని చెప్పవచ్చు. సో శింగనమల నియోజకవర్గానికి ఇన్‌ఛార్జ్‌ నాయకుడు కావాలిని వైసీపీ క్యాడర్ జగన్‌ దగ్గర చెప్పుకున్నట్లు సమాచారం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *