Jammalamadugu: వైసీపీ అధినేత జగన్‌కు సొంత జిల్లాలో చుక్కలు చూపిస్తున్నారు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి.వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరుడిగా కాంగ్రెస్ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన ఆదినారాయణ రెడ్డి మూడు సార్లు జమ్మలమడుగు ఎమ్మెల్యేగా గెలుపొందారు.2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా గెలిచిన ఆది నారాయణ 2014 గెలిచిన తర్వాత టీడీపీ గూటికి చేరి మంత్రి పదవి చేపట్టారు.
Jammalamadugu: అప్పటి వరకు వైఎస్ కుటుంబానికి నమ్మిన బంటుగా ఉంటున్న ఆది నారాయణ రెడ్డి తన క్యాడర్ కోసం పార్టీ మారడం జరిగింది. ఆది నారాయణ తర్వాత వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీ గూటికి చేరి జగన్‌ను చావు దెబ్బ కొట్టారు.2019 ఎన్నికల్లో ఓటమి చవి చూసిన ఆది నారాయణ రెడ్డి… 2024 ఎన్నికల్లో మాత్రం మళ్ళీ దేవగుడి దెబ్బ ఏంటో రుచి చూపించారు. వైసీపీ అభ్యర్థి గెలుపుతో పాటు వైఎస్ అవినాష్ రెడ్డిని ఓటమి అంచుల వరకు తీసుకెళ్ళారు. తన అన్న కుమారుడు భూపేష్ రెడ్డిని అవినాష్‌పై పోటీ చేయించి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. కడప జిల్లాలో వైసీపీ అధినేత జగన్‌పై విమర్శలు చేయడంలో ఆది నారాయణ తర్వాత ఎవరైనా అనే టాక్ నడుస్తోంది.
ఇది కూడా చదవండి: Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీలో ముంబైని కర్ణాటక ఎడ్జ్ దాటింది
Jammalamadugu: ఆది నారాయణ ఆరోపణలలో వాడి వేడితో నిజం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు. వైఎస్ కుటుంబం గురించి జగమెరిగిన ఆది నారాయణ తనదైన శైలిలో ప్రశ్నిస్తున్నారట ఒక పార్టీ అధినేతగా జగన్ దేశ వ్యాప్తంగా ప్యాలెస్‌లు నిర్మించుకొని రాజ భోగాలు అనుభవిస్తూ ప్రజలను మాత్రం పట్టించుకోలేదనే ఆరోపణలను సొంత పార్టీ నేతలే తిప్పికొట్టలేకపోతున్నారట.
Jammalamadugu: హైదరాబాద్, బెంగుళూరు, పులివెందుల, తాడేపల్లితో పాటు విశాఖలో నిర్మించిన ప్యాలెస్ ఎవరి కోసం అని ప్రశ్నించడంపై కౌంటర్ ఇవ్వలేని స్థితిలో వైసీపీ క్యాడర్ ఉంది. వీటితో పార్టీ కార్యాలయాల పేరుతో జిల్లాకో ప్యాలెస్ నిర్మాణంపై ప్రజలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. గత ఐదేళ్లు ముఖ్యమంత్రి హోదాలో కనీసం సొంత జిల్లాలో ప్రజలను కలవని జగన్… నేడు మళ్ళీ ప్రజల్లో తిరిగి ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తా అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆది నారాయణ సైతం విమర్శలు గుప్పించారు. మొత్తం మీద సొంత జిల్లాలో జగన్‌కు ఆది నారాయణ రంకు మొగుడిలా తయారయ్యారని చర్చించుకుంటున్నారట.. మరి ఆది ఆరోపణలకు సమాధానం చెప్తారా లేదా పరదాల చాటున పర్యటిస్తారా చూడాల్సిందే