Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ఎలా అధికారంలోకి రావడం వెనుక అంతో ఇంతో టీడీపీ క్యాడర్‌కు తోడ్పడింది. ప్రధానంగా చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో బీఆర్‌ఎస్ వ్యవహరించిన తీరు, సీఎం రేవంత్ రెడ్డితో సాన్నిహిత్యం నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ క్యాడర్ కాంగ్రెస్‌కు మద్ధతిచ్చిన విషయం తెలిసిందే.కొంతమంది నేతలైతే ఎన్నికల ప్రచారంలో చాలా చోట్ల తమ పార్టీ జెండాల కన్నా టీడీపీ జెండాలే ఎక్కువ కనిపించేలా చేసుకున్నారు.
Revanth Reddy: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం టీడీపీ కార్యాలయానికి వెళ్లి మరీ ధ్యాంక్స్ చెప్పి వచ్చారు.కానీ ఇప్పుడు వారు ప్రవర్తిస్తున్న తీరు విచిత్రంగా ఉంది. గెలుపు సంగతి తర్వాత ఇప్పుడు అసలైన రాజకీయం చేయాలనుకుంటున్నారు.అలా అనుకుని తాము ప్రయాణిస్తున్న బోటుకు చిల్లులు పెట్టుకుంటున్నారు.పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చిట్ చాట్ పేరుతో అమరావతిపై వైసీపీ వాయిస్ వినిపించారు.వరదల తర్వాత పెట్టుబుడులు పెట్టడానికి భయపడుతున్నారని చెప్పుకొచ్చారు. అమరావతిలో వరదలు రాలేదని ఆయనకూ తెలుసు..కానీ ఆయన వైసీపీ వాయిస్ వినిపించాలనుకున్నారాన్న అనుమానం తలెత్తుతోంది.
ఇది కూడా చదవండి: Youtube: భారత్ లో యూట్యూబ్ కొత్త రూల్స్
Revanth Reddy: దాని వల్ల తమ పార్టీకి ఎంత నష్టం చేస్తున్నారో ఆయనకు తెలుసు… ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏకంగా ఎన్టీఆర్ ఘాట్‌ను తీసేసి సెక్రటేరియట్ కట్టాలంటున్నారు.అక్కడ కడితే వ్యూ బాగుంటుందట. ఇలాంటి పిచ్చి మాటల వల్ల ఎవరికి నష్టమో ఆయనకు తెలియక కాదు.కాంగ్రెస్‌ని నిండా ముంచేందుకు మునుగోడు ఉపఎన్నిక తెచ్చి పరిస్థితి కాస్త మెరుగుపడే సరికి కాంగ్రెస్‌లో చేరారు ఇలాంటి నేతలు సొంత రాజకీయ ఎదుగదలకు పార్టీని నిండా ముంచుతున్నారన్న అభిప్రాయం సొంత పార్టీ నేతల్లోనే జోరుగా చర్చ జరుగుతుంది.
Revanth Reddy: ఏపీపై ఇప్పుడు వీరు విషం చిమ్మాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు.కానీ వీరిది ప్రత్యేకమైన ఎజెండా. అదేమిటో కాంగ్రెస్ ముఖ్యనేతలు గుర్తించాల్సిన అవసరం ఉంది.ఇప్పటికే బీఆర్ఎస్ సోషల్ మీడియాలో చేస్తున్న దాడిని ఎదుర్కోవడానికి తంటాలు పడుతున్నారు.ముందు ఆ పార్టీ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు అవసరమైన ప్రయత్నాలు చేయడం లేదు.కానీ ఇలా తమ పార్టీపై పదే పదే వ్యతిరేకత పెంచుకునే పనులు మాత్రం చేస్తున్నారు.