Sai Pallavi: ఎల్లమ్మ’గా అలరించబోతున్న సాయిపల్లవి! ‘దిల్’ రాజు నిర్మించిన ‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మలయాళీ ముద్దుగుమ్మ సాయిపల్లవి ఆ వెంటనే అదే బ్యానర్ లో ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ మూవీలో నటించి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను తన ఖాతాలో వేసుకుంది. మళ్ళీ ఇంతకాలానికి ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ లో మూవీ చేయడానికి సాయిపల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ‘బలగం’ వేణు దర్శకత్వంలో దిల్ రాజు ‘ఎల్లమ్మ’ చిత్రం చేయడానికి అంగీకరించారు. కానీ ఈ ప్రాజెక్ట్ పలువురు హీరోల దగ్గరకు వెళ్ళినా వాళ్ళు రకరకాల కారణాలతో ముందుకు రాలేదు. దాంతో ప్రస్తుతం తన బ్యానర్ లో ‘తమ్ముడు’ మూవీ చేస్తున్న నితిన్ తోనే ‘ఎల్లమ్మ’ను నిర్మించాలని దిల్ రాజు ఫిక్స్ అయిపోయారు. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ‘ఎల్లమ్మ’లో టైటిల్ రోల్ కు సాయి పల్లవిని మేకర్స్ అప్రోచ్ కాగానే… ఆమె అంగీకారాన్ని తెలిపిందని తెలుస్తోంది. నితిన్ – సాయిపల్లవి జంటగా నటించే తొలి చిత్రం ఇదే కావడం విశేషం.