RTC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేసే యోచనలో ఆ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ మేరకు తాజాగా ఆ పధకంపై అధ్యయనానికి మంత్రులతో కూడిన కమిటీని నియమిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తామని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తేల్చిచెప్పారు.
RTC: ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై అధ్యయనం చేయడానికి రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్‌రెడ్డి సారధ్యంలో, మంత్రులు అనిత, సంధ్యారణి సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీకి రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఎవరూ వేలెత్తి చూపకుండా ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేస్తామని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.
RTC: లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా వస్తామని, విజయవంతంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. పథకం అమలయ్యేనాటికి సమ్యలు అన్నింటినీ అధిగమిస్తామని తెలిపారు. ఒకటో తేదీన ప్రారంభించి 16వ తేదీన మూసేయడం మాకు ఇష్టం లేదని ఎద్దేవా చేశారు. మంత్రులతో ఏర్పాటైన సబ్ కమిటీ సమగ్ర విచారణ చేసిన తర్వాత ముఖ్యమంత్రి అనుమంతితో పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు.