NTR

NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు శస్త్రచికిత్స విజయవంతం.. హెల్త్ బులెటిన్ విడుదల చేసిన కిమ్స్ ఆస్పత్రి..!

NTR: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులకు ఇంకా మూవీ లవర్స్ కి బిగ్ రిలీఫ్ ఇచ్చే వార్త వచ్చింది. ఇటీవల జిమ్‌లో ఎక్సర్సైజ్ చేస్తూ భుజానికి గాయమైన ఎన్టీఆర్‌కు హైదరాబాద్ సికింద్రాబాద్‌లోని ప్రముఖ కిమ్స్ ఆసుపత్రిలో (KIMS Hospitals, Secunderabad) శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది.

ఈ మేరకు ఆసుపత్రి యాజమాన్యం బుధవారం (ఆగస్టు 12, 2026న) అధికారిక హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.
ఆర్థోస్కోపిక్ సర్జరీ సక్సెస్ – హెల్త్ బులెటిన్ ముఖ్యాంశాలు..
కిమ్స్ ఆసుపత్రి మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ సంబిత్ సాహు జారీ చేసిన హెల్త్ బులెటిన్ వివరాల ప్రకారం.. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్లు డాక్టర్ ఆర్‌.ఎ. పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి, డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ శ్రీనివాస్ రావు సూరపనేని లతో కూడిన ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఎన్టీఆర్‌కు ఆర్థోస్కోపిక్ సర్జరీ (Arthroscopic Surgery) నిర్వహించింది.
శస్త్రచికిత్స సంపూర్ణంగా విజయవంతమైందని, ప్రస్తుతం ఎన్టీఆర్ సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఎన్టీఆర్ వైద్యుల పర్యవేక్షణలో పునరావాస (Rehabilitation) ప్రక్రియను ప్రారంభించనున్నారని.. రాబోయే 2 నుంచి 3 నెలల వ్యవధిలో ఆయన పూర్తిగా కోలుకుని సాధారణ స్థితికి వస్తారని వైద్య బృందం ధీమా వ్యక్తం చేసింది.

అభిమానుల్లో ఆనందం – ‘డ్రాగన్’ షూటింగ్ బ్రేక్!

ఇటీవల భుజానికి తీవ్ర గాయం కావడంతో వైద్యులు శస్త్రచికిత్సను సిఫార్సు చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్, సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ‘డ్రాగన్’ (Dragon) అనే సినిమా వస్తుంది.
సర్జరీ విజయవంతం కావడంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. వైద్యుల సూచనల మేరకు 2 నుంచి 3 నెలల పూర్తి విశ్రాంతి అనంతరం ఎన్టీఆర్ తిరిగి ‘డ్రాగన్’ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నారు.

Image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *