Road Accident: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. త్రిస్సూర్‌లో రోడ్డు పక్కన నిద్రిస్తున్న వారిపై ట్రక్ దూసుకెళ్లింది. దీంతో రెండేళ్ల చిన్నారితో సహా ఐదుగురు మృతి చెందారు.
Road Accident: కేరళలోని త్రిసూర్‌లోని తిరపరైయర్ ప్రాంతంలో కొందరు తమిళులు గుడారం వేసుకుని రోడ్డు పక్కన నిద్రిస్తున్నారు. అప్పుడు దుంగలతో కూడిన లారీ అటుగా వస్తోంది. రెప్పపాటు సమయంలో లారీ ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు ప్రహరీగోడపైకి దూసుకెళ్లింది. అదే వేగంతో రోడ్డుపక్కన నిద్రిస్తున్న వారిపైకి కూడా దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో 4 ఏళ్ల చిన్నారి సహా 5గురు తమిళులు అక్కడికక్కడే మరణించారు. 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం అనంతరం స్థానికులు వారిని రక్షించి త్రిసూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Also Read: Hyderabad: దారుణం.. న్యాయం కోసం వెళ్తే మహిళపై లైంగిక వేధింపులు..
Road Accident: ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని వారు తెలిపారు. అనంతరం డ్రైవర్ అలెక్స్, అతనితో పాటు ఉన్న క్లీనర్ జోస్‌లను అదుపులోకి తీసుకున్నారు.
బాధితుల వివరాలు వెల్లడయ్యాయి. వాటి ప్రకారం మృతులు కాళియప్పన్(50), జీవన్(4), నాగమ్మ(39), బంగాసి(20), రెండేళ్ల చిన్నారి. చిన్నారి పేరు పోలీసులు బయటపెట్టలేదు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.