Kantara Chapter 1

Kantara Chapter 1: కాంతార చాప్టర్ 1: మెంటల్ మాస్ లుక్ లో రిషబ్ శెట్టి అరాచకం!

Kantara Chapter 1: కన్నడ సినిమా కాంతార బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా ప్రీక్వెల్‌గా కాంతార చాప్టర్ 1ని మేకర్స్ భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ ఇప్పటికే వేగంగా జరుగుతోంది. నేడు జూలై 7, రిషబ్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఓ శక్తివంతమైన పోస్టర్‌ను విడుదల చేసింది.

Also Read: Demonte Colony 3: ఘనంగా డిమాంటీ కాలనీ 3 స్టార్ట్!

Kantara Chapter 1: ఈ పోస్టర్‌లో రిషబ్ ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో కవచంతో యుద్ధ సన్నివేశంలో ఫైట్ చేస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ తో అంచనాలు ఇంకా పీక్స్ కి చేరాయి.ఈ చిత్రాన్ని రిషబ్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. హొంబాలే ఫిలింస్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Vishwak Sen: యంగ్ హీరో విశ్వక్ కి అండగా మెగాస్టార్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *