Rishab Shetty: ‘కాంతారా’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రిషబ్ శెట్టి ‘కాంతారా’ ప్రీక్వెల్ రూపొందిస్తున్నాడు. దీని తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘జై హనుమాన్’ కమిట్ అయ్యాడు. అలాగే ఛత్రపతి శివాజీ పై సందీప్ సింగ్ రూపొందించే సినిమాలోనూ నటించబోతున్నాడు. అయితే ఇటీవల రానా షోలో పాల్గొన్న రిషబ్ శెట్టి సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేయాలనుందని చెప్పాడు.
ఇది కూడా చదవండి: Surya: నైజీరియాలో సూర్య రోలెక్స్
Rishab Shetty: ‘అర్జున్ రెడ్డి’ ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టి ప్రభాస్ తో ‘స్పిరిట్’ సినిమా తీయబోతున్నాడు సందీప్ రెడ్డి వంగా. సందీప్ లా ఎవరూ ఆలోచించరని, తను తీసే ఏ సినిమాలో అయినా నటించటానికి రెడీ అని చెప్పేశాడు రిషబ్. మరి సందీప్ రెడ్డి రిషబ్ తో విడిగా సినిమా తీస్తాడా? లేక తను ప్రభాస్ తో తీయబోతున్న ‘స్పిరిట్’ సినిమాలో ప్రత్యేక పాత్ర ఏమైనా సృష్టిస్తాడా? అన్నది తేలాల్సి ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.
టాలీవుడ్ కు రేవంత్ రెడ్డి భారీ షాక్
Tollywood: శనివారం అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ చిత్రాలపై పిడుగు పాటే అనుకోవచ్చు. ‘పుష్ప2’ ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ లో తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందటం నుంచి ఇటీవల అల్లు అర్జున్ అరెస్ట్… విడుదల వంటి సంఘటనలు జరిగాయి. బన్నీ బెయిల్ తో ఇంటికి రాగానే సినీ ప్రముఖులు తనని చూడటానికి క్యూ కట్టడంపై కూడా సి.ఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. హాస్పిటల్లో చావుబతుకుల మధ్య ఉన్న పిల్లాడిని చూడటానికి ఎవరూ రాకపోవడంపై తప్పు పట్టారు. అంతే కాదు ఇకపై తాను సి.ఎం కుర్చీలో ఉన్నంత వరకూ సినిమాల ప్రీమియర్స్, టికెట్ రేట్ల పెంపు జరగదని కరాఖండీగా చెప్పేశారు.
Tollywood: దీని ప్రభావం సంక్రాంతికి రిలీజ్ కాబోయే సినిమాలపై పడనుంది. సంక్రాంతి వచ్చే సినిమాలలో రెండు దిల్ రాజు నిర్మాతగా, ఒకటి సితార ఎంటర్ టైన్ మెంట్ వారిది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలకు టిక్కెట్ రేటు పెంపు జరగకుంటే భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇటీవల తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ ఛైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న దిల్ రాజు ఈ వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తారో చూడాలి.