Surya: లోకేష్ కనకరాజ్ యూనివర్స్ లో భాగంగా ‘ఖైదీ2’, ‘రోలెక్స్’ సినిమాను ప్రకటించి ఉన్నారు. ప్రస్తుతం లోకేష్ రజనీకాంత్ ‘కూలీ’తో బిజీగా ఉన్నారు. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీనికి ఎల్.కె.యు కి ఎలాంటి సంబంధం లేదు. దీని తర్వాత కార్తీతో ‘ఖైదీ2’ పట్టాలెక్కిస్తాడనే ప్రచారం ఇప్పటి వరకూ ఉంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సూర్యతో ‘రోలెక్స్’ మొదలయ్యే అవకాలున్నాయని కోలీవుడ్ టాక్. ఈ సినిమాను నైజీరియాలో చిత్రీకరించటానికి సంబంధించిన అనుమతుల కసం అక్కడి ప్రభుత్వంతో టచ్ లోకి వెళుతున్నారట నిర్మాతలు.
ఇది కూడా చదవండి: Curry Leaves Benefits: కరివేపాకు ప్రయోజనాలు: శరీరానికి ఎన్ని లాభాలో తెలుసుకోండి
Surya: మేజర్ షెడ్యూల్ ను అక్కడే పూర్తి చేయాలని భావిస్తున్నాడట లోకేష్ కనకరాజ్. డ్రగ్స్, కొకైన్, హెరాయిన్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు అడ్డా నైజీరియానే. అందుకే ‘రోలెక్స్’ సినిమాను అక్కడ షూట్ చేయాలనుకుంటున్నాడట లోకేష్. గతంలో సూర్య నటించిన ‘వీడొక్కడే’ మూవీని కూడా నైజీరియాలోనే షూట్ చేశారు. విక్రమ్ మూవీలో చివరగా వచ్చే సూర్య ‘రోలెక్స్’ పాత్ర డ్రగ్స్ సామ్రాజ్యానికి అధినేతగా పరిచయం చేశాడు లోకేష్. అందుకే ఇప్పుడు సినిమాలో మేజర్ పార్ట్ ను నైజీరియాలో తీస్తారట. మరి లోకేష్ అన్నాతమ్ముళ్ళు సూర్య, కార్తీ సినిమాల్లో దేనిని ముందు మొదలు పెడతాడో చూద్దాం.