AP Cabinet: గత ప్రభుత్వం బాటలోనే కూటమి ప్రభుత్వం పయనిస్తుందా అన్న చర్చ జరుగుతుంది. దీనికి కారణం గత ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ శాఖలపై సమీక్షలు చేయడం సాయంత్రానికి ప్రెస్ నోట్ విడుదల చేయడం చేసేవారు. వైసీపీ పాలనలో ఒకటి రెండు ప్రెస్ మీట్లు తప్పా ఆయన నేరుగా మీడియాను పేస్ చేసింది లేదు.
జగన్ బాటలోనే ఆయన క్యాబినెట్ మంత్రులు నడిచారు. మంత్రులు వారి వారి శాఖలపై సమీక్షలు చేసేవారు కాదు. చేసినా మీడియాకు చేప్పే వారు కాదు. ఇక పోలిటికల్ ప్రెస్ మీట్లను మాత్రం వైసీపీ కేంద్ర కార్యాలయంలో పెట్టేవారు. వారి వారి శాఖల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఎవరికి తెలిసేది కాదు.ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా జగన్ బాటలోనే పయనిస్తుందా? అన్న చర్చకు దారితీసింది.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తి అయ్యింది. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు అనేకం… అదే సమయంలో ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసింది. దానిని గాడిలో పెట్టడానికి సీఎం చంద్రబాబు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అనేక శాఖలపై పదే పదే సమీక్షలు చేస్తున్నారు. వాటిల్ని గాడిలో పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో మంత్రులు పలు శాఖలపై సమీక్షలు చేయడంలేదన్న చర్చ జరుగుతుంది ఇందుకు కారణం… ప్రభుత్వం అనేక అభివృద్ది – సంక్షేమ కార్యక్రమాలపై నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో ముందుగా అధికారులు నుంచి ప్రతిపాదనలు రావడం అ తరువాత ఆయా శాఖ మంత్రులు దానిని పూర్తి స్థాయిలో సమీక్షలు చేయడం… అనంతరం ఫైనల్‌గా సీఎం వద్ద జరిగే సమీక్షలో దాని నిర్ణయాలు ఉంటాయి ప్రభుత్వంలో జరిగే పనులు ప్రచారం చేసుకోవడం ప్రభుత్వానికి చాలా అవసరం.
AP Cabinet: మీడియాకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వివరించాల్సిన భాద్యత అందిరిపై ఉంది కానీ ఏపీ ప్రభుత్వంలో అది జరగడం లేదన్న చర్చ జరుగుతుంది. సహజంగా ఎప్పుడు మీడియాలో ఉండాలని అనుకుంటారు చంద్రబాబు…దానికి కారణం తాను తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు వివరించడం చేస్తున్నారు. సీఎం వద్ద జరిగే సమీక్షలు దానికి సంబందించిన ప్రెస్ నోట్ రూపంలో ఇవ్వడం దానికి సంబందించిన విజువల్స్ ఎలక్ట్రానిక్ మీడియా కోసం పంపడం చేస్తున్నారు.
AP Cabinet: ముఖ్యమంత్రి వద్దనే కాదు… మంత్రులు వద్ద కూడా పీఆర్వోలు ఉన్నారు. మంత్రులు నారా లోకేష్, నారాయణ, వంగలపూడి అనిత, సవితల నుంచి మాత్రమే సరైన సమాచారం వస్తుంది. అయితే రెగ్యులర్‌గా మంత్రి నారాయణ అమరావతి నిర్మాణలపై సమీక్షలు, మున్సిపల్ శాఖలో సమీక్షలను ఆయన నేరుగా ప్రెస్ మీట్‌లు పెట్టి మరి మీడియాకు వివరిస్తున్నారు. ఇక జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా తన శాఖ గురించి తీసుకుంటున్న నిర్ణయాలు గురించి సచివాలయంలో ప్రెస్ మీట్లు పెడుతున్నారు. మిగిలిన మంత్రులు అసలు సచివాలయంలోనే సమీక్షలు చేస్తారు. మీడియాతో మాత్రం మాట్లడం లేదు. దీని వలన ప్రభుత్వ శాఖలలో ఏం జరుగుతుందో.. ప్రజలకు వివరించాల్సిన భాద్యత మంత్రులకు లేదా? అన్నచర్చ జరుగుతుంది. సచివాలయంలో సమీక్షలు అప్పుడప్పుడు చేస్తున్న మంత్రులు కేవలం వారి పీఆర్వో లేదా
సమాచార శాఖ నుంచి ప్రెస్ నోట్‌లు మీడియాకు జారీ చేస్తున్నారు..
పలువురు మంత్రులు ఇప్పటి వరకు సచివాలయంలో ప్రెస్ మీట్‌లు కూడా నిర్వహించలేదు అంటే పరిస్థితి ఎలా ఉందో చూడవచ్చు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 40 మంది మంత్రులు ఉండేవారు. వారి వారి శాఖలపై సమీక్షలు పెట్టి తప్పని సరిగా ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేస్తోందో వివరించేవారు. చేయకుండానే అది చేశాం… ఇది చేశాం అని చెప్పె రోజుల్లో తాము చేసిన పనిని కూడా చేప్పకపోవడం ఏంటో అలాంటి అమాత్యులే చెప్పాలి.
ఇదే సమయంలో కూటమి ప్రభుత్వంపై అధికార పార్టీ మీడియా ప్రత్యేక కథనాలు రాస్తుంది. ప్రభుత్వం తరుపున ఆ మీడియా కథనం తప్పు అని చేప్పాల్సిన వారు ఆయా శాఖల మంత్రులే… కానీ అలాంటి తప్పుడు కథనాలపై కూడా మంత్రులు మాట్లడం లేదని టాక్ నడుస్తోంది.
AP Cabinet: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలే అయిన… ఇలాంటి వాటిల్ని సరి చేయకపోతే… భవిష్యత్‌లో ప్రభుత్వానికి ఇబ్బంది తప్పదు అన్న చర్చ జరుగుతుంది దీనిపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రాసినవారు: వి. శ్రీనివాస్…
అమరావతి
సీనియర్ కరస్పాండెంట్