Game Changer: వచ్చే సంక్రాంతి సీజన్ లో మొదటిగా వస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. జనవరి 10వ తేదీ ఈ సినిమా జనం ముందుకు రాబోతోంది. దాంతో దేశ విదేశాల్లో ప్రమోషన్స్ ను పీక్స్ తీసుకెళ్ళే పనిలో నిమగ్నమై ఉంది చిత్ర బృందం. ఇటీవలే యు.ఎస్. లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడంతో పాటు ఓ పాటనూ అక్కడ విడుదల చేశారు. ఇక ఇక్కడ గూస్ బంప్స్ తెప్పించే థియేట్రికల్ ట్రైలర్ ను రెడీ చేస్తున్నారు. మొదట ఈ నెల 27న దీనిని విడుదల చేయాలని అనుకున్నా… 30వ తేదీకి దీనిని వాయిదా వేసినట్టు తెలుస్తోంది.
Game Changer: కొత్త ట్రైలర్ తో సరికొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలన్నది మూవీ టీమ్ ఆలోచన అంటున్నారు. హైదరాబాద్ లో దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారని, అలానే ఏపీలో ఫస్ట్ వీక్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుపుతారని సమాచారం. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ గెస్ట్ గా హాజరయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే… రామ్ చరణ్ ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నందువల్లే గురువారం జరిగి సీఎం మీటింగ్ కు హాజరు కాలేదట!