Rashmika

Rashmika: కన్నడిగుల ఆగ్రహం.. రష్మిక వ్యాఖ్యలతో కుబేర చిత్రానికి కష్టాలు?

Rashmika: చెన్నైలో జరిగిన కుబేర మెగా ఈవెంట్‌లో నటి రష్మిక మందన్న చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తన బాల్యం చెన్నైలో గడిచిందని, తొలి భాష తమిళమని రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. విరాజ్‌పేటలో పుట్టి, కూర్గ్‌లోని పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్న రష్మిక తమిళం తొలి భాష అనడంపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “కన్నడ భాషను కాదని తమిళం చెప్పడం ఏంటి?” అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

Also Read: Kannappa: పిలక, గిలక పాత్రల వివాదంపై విష్ణు క్లారిటీ!

Rashmika: గతంలో కమల్ హాసన్ కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలతో థగ్‌లైఫ్ చిత్రం కర్ణాటకలో నిషేధానికి గురై భారీ నష్టాలను చవిచూసింది. ఇప్పుడు రష్మిక వ్యాఖ్యలతో కుబేర చిత్రం కూడా కర్ణాటకలో రిలీజ్‌కు అడ్డంకులు ఎదుర్కొనే అవకాశం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చెన్నై ఈవెంట్‌లో రష్మిక, తన ఫోటోలతో ఆకట్టుకున్నప్పటికీ, ఈ వ్యాఖ్యలు వివాదానికి తెరలేపాయి. రష్మిక ఈ గొడవపై ఎలా స్పందిస్తారు? కుబేర చిత్రం రిలీజ్‌కు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? వేచి చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Ayodhya: అయోధ్య రామాల‌యం @ రికార్డుల మ‌యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *