Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇప్పటికే ఆయన ఈ నెల 14 నుంచి ఇదే నెల 23 వరకు విదేశీ పర్యటన టూర్ ఫిక్స్ అయింది. అయితే ఈ పర్యటనలో భాగంగా తొలుత ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉన్నది. ఇప్పుడు ఆ దేశ పర్యటనను రద్దు చేసుకున్నారు. దీంతో ఆయన పర్యటన ఈ నెల 14 నుంచి కాకుండా 17 నుంచి మొదలవుతుంది. ఢిల్లీలో జరిగే పార్టీ కార్యక్రమాలకు హాజరుకానున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
Revanth Reddy: ఈ నెల 14, 15, 16 తేదీల్లో ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. ఆయా కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 14వ తేదీనే ఢిల్లీ వెళ్లనున్నారు. 15, 16 తేదీల్లో కూడా సీఎం అక్కడే ఉండనున్నారు. ఇదే సమయంలో శుక్రవారం తిరుపతి పర్యటనను కూడా రద్దు చేసుకున్నట్టు తెలిసింది. ఈ రోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఆయన తిరుమలకు వెళ్లాలని తొలుత నిర్ణయించుకున్నారు.
Revanth Reddy: ఈ నెల 17న ఢిల్లీ నుంచే సీఎం రేవంత్‌రెడ్డి సింగపూర్ బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడే 17, 18 తేదీల్లో పర్యటిస్తారు. ఆ పర్యటనను ముగించుకొని 19న దావోస్ బయలుదేరి వెళ్లనున్నారు. ఆయన అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుల్లో పాల్గొంటారు. ఈ నెల 23 వరకు అక్కడే ఉంటారు. అక్కడే సుమారు 40 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్టు సమాచారం.