Narendra Modi: ‘‘మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలి’’ అని ప్రధాని మోదీ అన్నారు. జీరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ ‘పాడ్‌కాస్ట్’పై ప్రధాని మోదీ మాట్లాడారు. ఇందులో ప్రధానమంత్రి మాట్లాడుతూ.. నేను పోడ్‌కాస్ట్ కార్యక్రమంలో పాల్గొనడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ సంఘర్షణల విషయంలో భారత్ తటస్థంగా లేదు. శాంతి ఓ వైపు అని నిత్యం చెబుతున్నామని అన్నారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ.. తప్పులు తప్పవని మోదీ అంటున్నారు. నేను కూడా తప్పు కావచ్చు. నేను కూడా మనిషినే. దేవుడు కాను అని చెప్పారు. .రాజకీయ నాయకుడు కావాలనుకునే వాడు ఓ లక్ష్యంతో రావాలి. ఆశయంతో కాదు. మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలి. అంటూ ప్రధాని మోదీ పాడ్ కాస్ట్ లో చెప్పారు.