Republic Day: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో జరిగే 76వ గణతంత్ర దిన వేడుకల్లో తెలంగాణకు చెందిన డప్పు కళాకారుడు అమరారపు సతీష్‌కు అరుదైన అవకాశం దక్కింది. ఇది ఆయనకు రెండోసారి వచ్చిన అవకాశం. ఇటీవలే ఆయన బృందం విదేశాల్లో మన డప్పు కళను ప్రదర్శించి వచ్చింది. ఈ నెల 26న జరిగే గణతంత్ర వేడుకల కోసం ఆయన ఇప్పటికే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
Republic Day: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన సతీశ్ డప్పు కళలో విశేష ప్రావీణ్యత సంపాదించారు. ఆయన డప్పు కళకు గుర్తింపుగా జానపద సామ్రాట్ అవార్డు వరించింది. మట్టి కళారూపం అయిన డప్పు దరువును దేశ గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు సతీశ్‌కు రెండోసారి అవకాశం దక్కింది. అంతరించి పోతున్న డప్పు కళకు ప్రాణం పోస్తున్న సతీశ్‌కు ఈ అరుదైన గౌరవం దక్కడంపై పలువురు కళాకారులు, సాంస్కృతిక మేథావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.