RS 500 Notes

RS 500 Notes: రూ. 500 నోట్లు రద్దు కానున్నాయా?.. సోషల్ మీడియా వైరల్ వార్తల్లో నిజమెంత?

RS 500 Notes: గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోంది. 2026 మార్చి నాటికి దేశంలో 500 రూపాయల నోట్లను ప్రభుత్వం రద్దు చేయబోతోందని, ఇకపై ఇవి చెల్లవని ఆ సందేశాల సారాంశం. గతంలో 1000, 2000 రూపాయల నోట్లను రద్దు చేసిన అనుభవంతో, ఈ వార్త విన్న సామాన్య ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే, ఈ ప్రచారంలో అస్సలు వాస్తవం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ వైరల్ వార్తలపై కేంద్ర ప్రభుత్వ అధికారిక సంస్థ PIB స్పందిస్తూ గట్టి క్లారిటీ ఇచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అటువంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని, రూ. 500 నోట్లను రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పింది. సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ కేవలం పుకార్లేనని, వీటిని నమ్మి ప్రజలు కంగారు పడవద్దని కోరింది.

ప్రస్తుతం మన దేశ కరెన్సీలో అతిపెద్ద నోటుగా ఉన్న రూ. 500 నోటు అన్ని రకాల లావాదేవీలకు యథావిధిగా చెల్లుతుందని అధికారులు వెల్లడించారు. గతంలో కూడా పార్లమెంటులో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. 500 నోట్లతో పాటు 100, 200 రూపాయల నోట్ల సరఫరా కూడా నిరంతరం కొనసాగుతుందని, ఏటీఎంల ద్వారా కూడా ఇవి అందుబాటులో ఉంటాయని ఆయన వివరించారు.

కాబట్టి, వాట్సాప్ లేదా ఫేస్‌బుక్‌లో వచ్చే ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మకండి. ఏదైనా సమాచారం అధికారికంగా ప్రభుత్వం నుండి వచ్చే వరకు వేచి చూడాలి. ధృవీకరించని వార్తలను ఇతరులకు ఫార్వార్డ్ చేయవద్దని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. మీ దగ్గర ఉన్న 500 రూపాయల నోట్లు ఎప్పటికీ భద్రమే, వాటిని ధైర్యంగా వాడుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *