RBI

RBI: రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన

RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా కీలక ప్రకటన చేసింది. దాదాపు రెండేళ్ల క్రితం చలామణి నుంచి తొలగించిన రూ.2,000 నోట్లలో ఇంకా పెద్ద మొత్తంలో ప్రజల వద్దే ఉన్నాయని వెల్లడించింది. ఇప్పటికీ మొత్తం 100 శాతం నోట్లు తిరిగి రాలేదని స్పష్టం చేసింది.

2023 మే 19న, ఆర్బీఐ అధికారికంగా ఈ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించింది. అప్పటికి దేశంలో ఉన్న మొత్తం రూ.2 వేల నోట్లలో 98.26 శాతం నోట్లు మాత్రమే బ్యాంకుల ద్వారా తిరిగి వచ్చాయి. అయితే ఇప్పటికీ ప్రజల వద్ద సుమారు రూ.6,181 కోట్ల విలువైన నోట్లు ఉండిపోయాయని RBI తెలిపింది.

Also Read: virat kohli Pub: విరాట్ కోహ్లీ ప‌బ్‌పై కేసు.. అందుకేనా?

RBI: ఈ నేపథ్యంలో, ఇప్పటికీ చేతిలో ఈ నోట్లను ఉంచుకుని ఉన్నవారు వాటిని పోస్టాఫీసులు లేదా RBI ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకోవచ్చని కేంద్ర బ్యాంక్ సూచించింది. ఈ ప్రక్రియను ఉపయోగించుకోవాలని ప్రజలకు సూచించింది. అధికారిక గణాంకాల ప్రకారం, చాలామంది తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను తిరిగి ఇచ్చినప్పటికీ, ఇంకా కొంతమంది నోట్లు మార్చుకోకుండా ఉంచుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *