Kannappa

Kannappa: పిలక, గిలక పాత్రల వివాదంపై విష్ణు క్లారిటీ!

Kannappa: మంచు విష్ణు భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ‘కన్నప్ప’ చిత్రం విడుదలకు ముందే వివాద గూటిలో చిక్కుకుంది. బ్రహ్మానందం, సప్తగిరి పోషించిన పిలక, గిలక పాత్రలు బ్రాహ్మణ సమాజాన్ని అవమానిస్తున్నాయంటూ బ్రాహ్మణ చైతన్య వేదిక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పాత్రలను వెంటనే తొలగించకుంటే హైకోర్టు తలుపు తట్టేందుకు సిద్ధమని హెచ్చరించింది.

తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు ఊపందుకుంటున్నాయి. ఈ ఆరోపణలపై మంచు విష్ణు స్పష్టతనిచ్చారు. సినిమా ఎవరి మనోభావాలనూ దెబ్బతీయలేదని, శివభక్తి చాటడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి సన్నివేశాన్ని వేద పండితుల మార్గదర్శకత్వంలో జాగ్రత్తగా రూపొందించామని వెల్లడించారు.

Also Read: War 2: వార్ 2 ఫీవర్: భారీ రిలీజ్‌కు రంగం సిద్ధం!

Kannappa: జూన్ 27న విడుదలయ్యే ఈ సినిమాను చూసిన తర్వాతే అభిప్రాయాలు చెప్పాలని, అప్పటివరకు ఆందోళనలు ఆపాలని అభిమానులకు, సమాజానికి విజ్ఞప్తి చేశారు. ఈ వివాదం చిత్ర విడుదలపై ఎలాంటి ప్రభావం చూపనుంది? అసలు ఈ పాత్రలు ఎందుకు వివాదాస్పదమయ్యాయి? అనేవి చర్చనీయంశంగా మారాయి. ఏది ఏమైనా ఇప్పుడు అందరి దృష్టి ‘కన్నప్ప’పైనే ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mahanadu 2025: మళ్ళి జన్మంటూ ఉంటె తెలుగు గడ్డపైనే పుడతా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *