Rape Case: సమాజంలో నీతి, నియమాలు, సామాజిక కట్టుబాట్టు సన్నగిల్లి పోతున్నాయనడానికి ఈ సంఘటనే నిదర్శనం. బాల్య దశలోనే ఇలాంటి నియమాలు నేర్చుకోవడం లేదా? మనమే నేర్పించడం లేదా? అని ఈ ఘటనతో ప్రశ్నించుకోవాల్సిన సమయం. బడిలో అమ్మాయిలంటే ఆమడదూరంలో ఉండే ఆనాటి రోజులకు, స్కూల్‌లో అబ్బాయిలు, అమ్మాయిలూ కలగలిసి పోతున్న ఈ రోజులకు తేడా అభివృద్ధి అందామా? అప్‌డేట్ సమాజం అని పిలుచుకుందామా? ఒకవేళ అలాగే పిలుచుకుందామని సర్దుకున్నా.. తరచూ జరుగుతున్న ఇలాంటి విపరిణామాలకు ఎవరు సమాధానం చెప్తారు? అని ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ ఎదురవుతున్నాయి.
Rape Case: అది హైదరాబాద్ మహానగరంలోని మోడ్రన్ లైఫ్‌కు అడ్డాగా ఉండే గచ్చిబౌలి ప్రాంతం. అక్కడి ఓ స్కూల్‌లో ప్రేమ పేరుతో ఓ బాలికను మరో బాలుడు వేధించాడు. అదే ఆమె చేసిన పాపమైంది. ప్రేమను నిరాకరించిందనే కారణంతో ఆ బాలుడు ఏకంగా మార్ఫింగ్ ఫొటోలతో బాలికకు నిత్యం వేధించసాగాడు. ఇలా బ్లాక్ మెయిల్ చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇదే సమయంలో మరో బాలుడు వీడియోను రికార్డ్ చేశాడు. ఇదే వీడియోను చూపించి ఆ బాలికను ఆ బాలుడు లైంగికంగా వేధించాడు.
Rape Case: వీడియో షూట్ చేసిన సమయంలో ఫోన్‌ను ఆ బాలిక పగులగొట్టింది. ఈ విషయంపై ఇద్దరూ గొడవ పడుతుండగా మరో బాలుడు చూశాడు. ఇక అతను కూడా ఆ బాలికను వేధించసాగారు. ఇలా ఒకరు కాదు.. ఏకంగా ముగ్గురు మైనర్లు ఆ బాలికకు నిత్యం నరకం చూపారు. ఒకరు కాకుంటే మరొకరు వేధింపులతో చంపుకుతినేవారు. ఇలా నిత్యం ఆ బాలిక మానసిక వేదనతో కుంగిపోయేది. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పుకోలేక, బాధను దిగమింగుకోలేక సతమవుతున్న ఆ బాలిక బాధను గమనించిన ఆ బాలిక స్నేహితులు ధైర్యం చేసి ఆమె తల్లిదండ్రులకు విషయాన్ని చేరవేశారు.
Rape Case: ఈ విషయం తెలిసిన బాధితురాలైన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారించిన పోలీసులు బాలికను వేధింపులకు గురిచేసిన ఆ ముగ్గురు మైనర్లపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. దీనికి ఆ మైనర్లు కారణంగా కనిపిస్తున్నా.. నీతి, నియమాలు, మంచి, చెడు విచక్షణ నేర్పని తల్లిదండ్రులదా బాధ్యత. లేకుంటే క్రమశిక్షణ, కఠోర నియమాలు నేర్పని గురువులు బాధ్యులా? ఉచ్ఛం, నీచంపై ఉనికే లేని సమాజానిదా బాధ్యత. ఎవరిని నిందిద్దాం. పరిపక్వత వయసు కూడా రాని పిల్లలే ఇలా భరితెగిస్తుంటే.. మున్ముందు సమాజ గమణం ఎటు దారితీస్తుందోననే బాధ కలుగకమానదు.