Ram gopal varma: రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ)కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హై కోర్టు. ఆయన సినిమాల్లో రాజకీయ నాయకులపై చేసిన విమర్శలతో ఆయనపై ప్రకాశం జిల్లా, అనకాపల్లి, తుళ్లూరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి, ఈ కేసులు ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల్లో రాజకీయ నాయకుల పై మార్ఫ్ చేసిన ఫోటోలు, వీడియోలు, బూతులు విమర్శలను ప్రస్తావించిన తర్వాత నమోదయ్యాయి.
వర్మపై మరిన్ని చర్యలు తీసుకోవడానికి పోలీసులు నోటీసులు ఇచ్చినా, ఆయన వాటిని తిరస్కరించారు. పోలీసులు అర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆయన తప్పించుకు తిరిగినట్టు వార్తలు వచ్చాయి.
ఆర్జీవీ కోర్టు ముందు ముందస్తు బెయిల్ కోసం వెళ్లారు. అప్పుడు ఏపీ హైకోర్టు అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే, హైకోర్టు ఆర్జీవీకి పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎప్పటికప్పుడు వివాదాలకు ప్రసిద్ధి చెందిన అర్జీవీ పోలీసులకు సహకరిస్తాడా లేదా అని ఆసక్తి చూపిస్తు న్నారు నెటిజన్లు.