Yash: వరుస గ్యాంగ్‌స్టర్ సినిమాలు చేస్తున్న యశ్, తన తాజా సినిమా ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ గురించి లాస్ వేగాస్‌లో నిర్వహించిన సినిమాకాన్ 2026లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. “ఈ సినిమా అందరూ అనుకునేలా ఉండదు. ఇకపైన గ్యాంగ్‌స్టర్ సినిమాలు చేసే వారికి ఇది ఒక గైడ్‌లా ఉంటుంది. అసలు గ్యాంగ్‌స్టర్ సినిమాలు ఎలా తీయాలో ఈ సినిమా నేర్పిస్తుంది” అన్నారు.
ఈ సినిమాను తొలిసారిగా ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో కూడా తీసినట్లు ఆయన చెప్పారు. “ఇది రెగ్యులర్ గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే పొరబడినట్టే, స్టోరీలో చాలా లేయర్స్ (Layers) ఉంటాయి. సినిమా చూస్తున్న సమయంలో మీకే తెలుస్తుంది” అన్నారు. అలాగే ఇందులో సైకాలజీ గురించి కూడా డిస్కస్ చేశామని, దీనివల్ల ఒకసారి మనల్ని మనం చూసుకుంటామని చెప్పారు. సినిమాలో ఒక డార్క్ క్యారెక్టర్ గురించి చెబుతున్నామని, అలాగే మనుషుల బంధాల గురించి కూడా మీరు చాలానే చూస్తారని, ఇది మాత్రం తాను చెప్పగలనని ఆయన అన్నారు.
గీతూ మోహన్ దాస్‌తో వర్క్ చేయడం నాకు ఎంతగానో ఆనందాన్ని ఇచ్చింది, ఆమె మేకింగ్ స్టైల్ కొత్తగా ఉంటుంది. విజువల్ ట్రీట్‌లా ప్రతి ఫ్రేమ్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. గ్యాంగ్‌స్టర్ సినిమాలను ఆమె చూసే దృష్టి కోణం వేరేలా ఉంటుంది. ఈ సినిమా చూసే ఆడియన్స్ సైకాలజీ పైనా ఆమె ప్రభావం బాగానే పడుతుంది.
‘టాక్సిక్’ సినిమాను మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్, కేవీఎన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే సినిమా ఇప్పటికే విడుదల అయ్యుండేది. మార్చి 19న రిలీజ్ చేయాలనుకున్నా.. అదే సమయంలో ‘ధురంధర్-2’ రిలీజ్, ఇంకా అమెరికా-ఇరాన్ యుద్ధం రావడంతో సినిమాను జూన్ 4కి వాయిదా వేశారు. ఇప్పుడు అదే సమయంలో అంటే జూన్‌లోనే రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా కూడా విడుదల కానుంది.
