Ram charan Upasana: స్టార్ హీరో రామ్ చరణ్ కడప పెద్ద దర్గాకు వెళ్ళి ఉరుసు ఉత్సవాల్లో పాల్గొనడాన్ని ఆయన భార్య ఉపాసన సమర్థించుకున్నారు. అయ్యప్ప దీక్షలో ఉండి రామ్ చరణ్ అక్కడకు వెళ్ళడాన్ని కొందరు విమర్శించారు. దీనిపై ఆమె స్పందిస్తూ, ‘నమ్మకం అనేది అందరినీ కలిపి ఉంచుతుంది. విడదీయదు. భారతీయులుగా మేం అన్ని మతాలను గౌరవిస్తాం. ఐకమత్యంలోనే మన బలం ఉంటుంది’ అని పేర్కొన్నారు. తన మతాన్ని అనుసరిస్తూనే ఇతరుల విశ్వాసాన్ని గౌరవించడం రామచరణ్ అలవాటు అని ఆమె చెప్పారు. అలానే ‘వన్ నేషన్ వన్ స్పిరిట్’, ‘జైహింద్’ అనే హ్యాట్యాగ్స్ ను ఆమె తన ఎక్స్ పోస్ట్ లో పేర్కొన్నారు. మరి ఇప్పటికైనా… రామ్ చరణ్ మీద కొందరు చేస్తున్న విమర్శలకు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి. ఇదిలా ఉంటే రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ జనవరి 10న విడుదల కాబోతోంది.