Ajith Kumar: అజిత్ హీరోగా మగిళ్ తిరుమేని డైరెక్షన్ లో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ‘విడాముయర్చి’ సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి స్పందన లభించింది. తాజాగా మేకర్స్ ఓ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. అనిరుధ్ స్వరాలు సమకూర్చిన ‘సవదీక’ అనే ఈ పాట ఫాస్ట్ బీట్ తో ఎనర్జిటిక్ గా ఉంది. దీనిని అరివు రాయగా, ఆంథోని దాసన్ పాడారు. యాక్షన్ కింగ్ అర్జున్, త్రిష, ఆరవ్, రెజీనా కసండ్ర, నిఖిల్ నాయర్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ‘విడాముయర్చి’ సినిమా శాటిలైట్ హక్కులను సన్ టీవీ సొంతం చేసుకోగా, ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. సోనీ మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలవుతుంది.
Dream Catcher: సైకలాజికల్ థ్రిల్లర్ గా ‘డ్రీమ్ క్యాచర్’
Dream Catcher: ప్రశాంత్ కృష్ణ, అనీషా ధామ, శ్రీనివాస్ రామిరెడ్డి, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రలు పోషిస్తున్న సినిమా ‘డ్రీమ్ క్యాచర్’. సీయెల్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను సందీప్ కాకుల తెరకెక్కిస్తున్నారు. ‘ఇన్ సెప్షన్’ స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందించినట్టు దర్శకుడు చెబుతున్నారు. జనవరి 3న సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో శుక్రవారం ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ సినిమా ట్రైలర్ కు మ్యూజిక్ అందించిన వెంకటేశ్, సిద్ధార్థ్ కాకుల మూవీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. పాటలు, ఫైట్స్ లేకుండా తీసి ఈ చిత్రానికి రోహన్ శెట్టి నేపథ్య సంగీతం అందించారు. కలల నేపథ్యంలో ఇలాంటి సినిమా ఇంతవరకూ తెలుగులో రాలేదని, గంటన్నర నిడివితో సినిమా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది.