KTR: కేటీఆర్ తాజా వ్యాఖ్యల్ని గమనిస్తే.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికే ఫార్ములా-ఈ రేస్ నిర్వహించేందుకు రూ.55 కోట్లు చెల్లించామని కేటీఆర్ అన్నారు. ఇందులో అవినీతి ఏముంది అన్నారే తప్ప.. తాను కేబినెట్ పర్మిషన్ తీసుకున్నాననీ, ఆర్థిక శాఖ ఆమోదం పొందాననీ, అలాగే.. రిజర్వ్‌బ్యాంక్ రూల్స్‌కి అనుగుణంగానే డబ్బు చెల్లించామని అనలేదు. అలా ఎందుకు చెయ్యలేదు అనేదే ఆయనకు ఏసీబీ నుంచి ఎదురవుతున్న ప్రశ్న… దానికి సమాధానం చెప్పకుండా… కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడటం వల్ల ప్రయోజనం ఏముందనే ప్రశ్న వస్తోంది.
KTR: ఫార్ములా-ఈ రేసు 10వ సీజన్‌ను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసినప్పుడు… ఆల్రెడీ చెల్లించిన మనీకి సంబంధించి… అంతర్జాతీయ ఫార్ములా-E నిర్వాహక సంస్థ FIA (ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఫెడరేషన్ )కి భారత విభాగం చెల్లించిన రూ.73 లక్షల రేసు ఫీజును వెనక్కి పంపినప్పుడు… సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదని కేటీఆర్ ప్రశ్నించారు. తద్వారా తప్పు జరిగిందని ఆయన పరోక్షంగా ఒప్పుకుంటున్నట్లు అవుతోందనే వాదన విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: CP CV Anand: రిపోర్టర్స్ తో సీపీ జోకులు..
KTR: కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఫీజు డబ్బును వెనక్కి తీసుకోకపోవడానికి బలమైన కారణం ఉంది. ఈ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం చెబుతోంది కాబట్టి.. నిజానిజాలు తేలాల్సిందే కాబట్టి.. ఈ కారణాన్ని ప్రభుత్వం ధైర్యంగా చెప్పగలుగుతోంది. కానీ కేటీఆర్ తన వైపు నుంచి తన వాదనను బలంగా వినిపించలేకపోయారని విశ్లేషకులు అంటున్నారు.
KTR: ఫార్ములా-ఈ రేసు వల్ల రూ.700 కోట్ల పెట్టుబడులు తెలంగాణకి వచ్చాయంటున్న కేటీఆర్… ఏ తప్పూ చెయ్యకపోతే… ఢిల్లీ నుంచి సీనియర్ లాయర్లను ఆఘమేఘాలపై పిలిపించుకోవాల్సిన అవసరం ఏముందనే ప్రశ్న సోషల్ మీడియాలో వినిపిస్తోంది. తప్పు చెయ్యని వాళ్లు… అదే విషయాన్ని కోర్టులో చెప్పొచ్చు కదా, దీనికి లాయర్ల అవసరం ఏముంది? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏదో తేడా జరిగింది కాబట్టే… దాన్ని కప్పిపుచ్చడానికే ఇలా సుప్రీంకోర్టు స్థాయి లాయర్లను పిలిపించుకుంటున్నారు అని టాక్ వినిపిస్తోంది.
ఇది కూడా చదవండి: Rishab Shetty: సందీప్ రెడ్డితో రిషబ్ శెట్టి
KTR: మొత్తంగా కేటీఆర్ ఓవైపు రూ.55 కోట్లను రెండు దఫాలుగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా చెల్లించామని చెబుతూనే… అందులో ఎలాంటి అక్రమాలూ లేవని అంటున్నారు. ఐతే.. ACB వైపు నుంచి వస్తున్న ప్రశ్నలకు మాత్రం ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వలేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా కేటీఆర్ ముందు ఇప్పుడు ఈ కేసు పెద్ద సవాలుగా ఉంది. ఏ నేరమూ జరగలేదు అంటున్న ఆయన.. దీనిపై కోర్టులో ఎలా వాదనలను వినిపిస్తారో, కోర్టు ఎలా స్పందిస్తుందో త్వరలో తెలుస్తుంది.