Rajnath Singh: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ ఆర్మీ సిబ్బందితో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. అస్సాంలోని తేజ్‌పూర్ మేఘనా స్టేడియంలో ఆర్మీ సిబ్బందితో కలిసి రాత్రి భోజనం చేశారు.
ఎల్‌ఓసీ, అట్టారీ సరిహద్దుల్లో సైనికులు స్వీట్లు పంచి, కొవ్వొత్తులు వెలిగించి, బాణాసంచా కాల్చారు. దీపావళి సందర్భంగా LOCలో సైనికులు ఉత్సాహంగా నృత్యం చేశారు.
మరోవైపు భారత వాయుసేన చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ జమ్మూకశ్మీర్ చేరుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో సైనికులను కలుసుకుని దీపావళి శుభాకాంక్షలు తెలిపి వారితో కలిసి అల్పాహారం చేశారు.
ఇది కూడా చదవండి: Nara lokesh: గూగుల్ క్లౌడ్ సీఈఓతో నారా లోకేష్ భేటీ
Rajnath Singh: అలాగే, సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ పోర్ట్ బ్లెయిర్, అండమాన్ – నికోబార్‌లో మోహరించిన సైనికులతో దీపావళి జరుపున్నారు. నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో నౌకాదళ సిబ్బందితో కలిసి పండుగ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ప్రధాని మోదీ ఏటా ఆర్మీతో దీపావళి జరుపుకునేవారు. ఈసారి దీపావళి రోజున గుజరాత్ టూర్‌లో ఉన్నారు. దీంతో త్రివిధ దళాధిపతులు మరియు CDS వివిధ ప్రాంతాలకు చేరుకుని సైనికులతో దీపావళి జరుపుకున్నారు.