Jailer 2: బాక్సాఫీస్ వద్ద తలైవా రజినీకాంత్ మ్యాజిక్ మొదలైతే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘జైలర్’ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్ 2’ (Jailer 2) కోసం ట్రేడ్ వర్గాల్లో భారీ క్రేజ్ మొదలైంది. అక్టోబర్ 15న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కుల కోసం ప్రముఖ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
రేటు విషయంలో బేరసారాలు – ₹55 కోట్లు కోట్ చేసిన సన్ పిక్చర్స్..
రీషూట్‌లు, ఆలస్యాల వల్ల మధ్యలో కొద్దిగా బజ్ తగ్గినట్లు అనిపించినా.. సీక్వెల్ హైప్, హృతిక్ ఎంట్రీ వార్తలతో మళ్లీ మార్కెట్‌లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఈ భారీ డీల్‌ను ఎవరు దక్కించుకుంటారు? సన్ పిక్చర్స్ చెప్పిన రేటుకు ఎవరు ఒకే చెబుతారు? అన్నది ఇప్పుడు సౌత్ ఇండియా ట్రేడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
