Ap news: రాయలసీమకు భారీ వర్ష సూచన..

Ap news: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు. రాయలసీమ, దక్షిణ కోస్తాలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి మంగళవారం లోగా అల్పపీడనంగా రూపాంతరం చెందే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గుర్తించింది.

తర్వాత రెండు రోజుల్లో పశ్చిమ దిశగా కదులుతుందని, తమిళనాడు లేదా శ్రీలంక తీరాల వైపు పయనించే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. నైరుతి బంగాళాఖాతం మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని, దీని ప్రభావంతో మంగళ, బుధ, గురువారాల్లో వానలు పడతాయని చెప్పారు.

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నయి.

హైద్రాబాద్ లో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 32 డిగ్రీల సెల్సియస్, మినిమమ్ 23 డిగ్రీల సెల్సియస్ ఉంది. మధ్యాహ్నం 2 తర్వాత వాతావరణం చల్లబడే అవకాశం ఉంది. వరంగల్ లో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 34 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మినిమమ్ 27 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఉదయం 11 తర్వాత ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉంది.

విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 34 డిగ్రీల సెల్సియస్, మినిమమ్ 29 డిగ్రీల సెల్సియస్ ఉంది. మధ్యాహ్నం 3 తర్వాత వర్షాలు పడే అవకాశం ఉంది. విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 31 డిగ్రీల సెల్సియస్, మినిమమ్ 29 డిగ్రీల సెల్సియస్ ఉంది. మధ్యాహ్నం 3 తర్వాత అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *