Payyavula Keshav: ఈరోజు ఏపీ ప్రభుత్వం 2024-25 బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ సందర్భంగా విజయవాడలో క్యాంప్ కార్యాలయంలో ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ కు బడ్జెట్ పత్రాలను ఆర్థికశాఖ అధికారులు అందచేశారు. ఉన్నతాధికారులు పీయూష్ కుమార్, జానకీ, నివాస్ బడ్జెట్ పత్రాలను అందించిన తరువాత వాటికీ మంత్రి పయ్యావుల కేశవ్ పూజలు నిర్వహించారు . ఈరోజు 10గంటలకు పయ్యావుల కేశవ్అ సెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు . దాదాపు 2.90లక్షల కోట్లతో 2024-25 వార్షిక బడ్జెట్ రూపకల్పన బడ్జెట్ పత్రాలతో సిఎం చంద్రబాబు నివాసానికి మంత్రి కేశవ్ బయలుదేరి వెళ్లారు . క్యాంప్ కార్యాలయంలో సిఎం చంద్రబాబు కు బడ్జెట్ పత్రాలను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్,ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు అందచేశారు .