Rahasyam Idam Jagath: మన పురాణాలు, ఇతిహాసాలతో పాటు శ్రీచక్రం గురించి చర్చిస్తూ ఓ కొత్త అనుభూతిని అందించటానికి చేసిన చిత్రమే ‘రహస్యం ఇదం జగత్’ అంటున్నారు దర్శకనిర్మాతలు. నవంబరు 8న విడుదల కానున్న ఈమూవీలో రాకేష్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం ముఖ్య పాత్రలు పోషించారు. సింగిల్ సెల్ యూనివర్శ్ ప్రొడక్షన్ పతాకంపై కోమల్ ఆర్ భరద్వాజ్ దర్శకత్వంలో పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల నిర్మించిన ఈచిత్రం ట్రైలర్ను చందు మొండేటి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘టీజర్ చూసి ఎగ్జైట్ ఫీలయ్యాను. నేను బాగా కనెక్ట్ అయ్యే వాటికి దగ్గరగా ఈ సినిమా కాన్సెప్ట్ ఉంది. ఇలాంటి సినిమా తీయడం చాలా కష్టం. తప్పకుండా ఈ చిత్రం అందర్ని అలరిస్తుందనే నమ్మకం వుంది’ అన్నారు. తనకు ‘కార్తికేయ స్పూర్తి అని.. చందు మొండేటి ప్రేరణతో ఈ సినిమా రూపొందించానని, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని ‘కల్కి, హనుమాన్, కార్తికేయ’లా మైథలాజికిల్ చిత్రమని అంటున్నారు దర్శకుడు కోమల్ ఆర్ భరద్వాజ్. ఈ కార్యక్రమంలో హీరోయిన్ స్రవంతి పత్తిపాటి, మానస వీణ, సంగీత దర్శకుడు గ్యానీ పాల్గొన్నారు.