Dandari-Gussadi festival: సంస్కృతి సాంప్రదాయలను పాటించడం లో గిరిజనులు ముందు వరసలో ఉంటారు, దీపావళి పండుగ సందర్బంగా ఆదివాసీలు ఘనంగా జరుపుకొనే దండారి ఉత్సవాలలో గుస్సడి నృత్యాలు గిరిజన గుడాలలో సందడి చేస్తున్నాయి…అడవి ఒడిలో ఆదివాసీ గూడాల్లో దండారి సంబరం దండిగా సాగుతోంది. మారుమూల గోండ్ గూడాలు గుస్సాడి నృత్యాలతో మారుమోగుతున్నాయి…దండారి సంబరాలు అడవి బిడ్డల గుండెల్లో ఆనందోత్సవాలను నింపుతున్నాయి…దక్షణ భారత దేశంలో ఉన్న ఏకైక ఆదివాసీ ఆలయము పద్మల్ పూరి కాకో ఆలయానికి పలు రాష్ట్రాల నుండి ఆదివాసీలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి పూజలు చేస్తున్నారు.
Dandari-Gussadi festival: ఆదివాసిల సంస్కృతి ప్రతిభిమ్భించేవి గుస్సాడి నృత్యాలు.. ఆదివాసీ గూడాల్లో అంగరంగ వైభవంగా దండిగా సాగే దండారి పండుగ సంబరం మొదలైంది. డప్పుల దరువులు , గజ్జెల మోతలు , గుస్సాడీ నృత్యాలతో అడవి తల్లి మురిసి పోతుంది… దండారి అంటేనే ఆదివాసీ గూడేల్లో సంబరాల వేడుక..యేటా ఆదివాసులు అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే తమ ఆరాధ్య దేవత ‘ఏత్మాసార్ పేన్’ పేరిట చేసే ప్రత్యేక పండుగతో దండారి పండుగ ప్రారంభమవుతుంది..దీపావళి పర్వదినం పది రోజుల ముందు నుండే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోని గిరిజన గుడాలలో దండారి పండుగ సంబరాలు ఘనంగా జరుగుతాయి..దండారి వేడుకల్లో గుస్సాడీలదే కీలక పాత్ర…వారి వేశాదరణ ఆకట్టుకుంటుంది. నెత్తిపై నెమలి పించం..ఆ పించానికి ఇరు వైపులా దుప్పి కొమ్ములు.. పించం మద్యలో తలుక్కున మెరిసి అద్దం.. భుజానికి జింక తోలు, నడుము, కాళ్లకు గళ్లుగళ్లున మోగే గజ్జెలు, మెడలో శివయ్య రుద్రాక్షమాల..ఒక్క చేతిలో మంత్రదండం లాంటి కర్ర పట్టుకొని మరోచేతిలో జింక చర్మము పట్టుకొని ఒళ్ళంతా బూడిద పూసుకొని గిరిజనులు ప్రత్యేకంగా తాయారు అవుతారు…ఈ వేషధారణ వేసేముందు గిరిజనులు ఇంద్రాయి దేవత మొక్కులు తీర్చు కుంటారు …అందులో భాగంగా తలవెంట్రుకలు ..రెప్పల వెంట్రుకలు తీయడం ఆనవాయితి …ఇంద్రాయి దేవతకు పూజలు చేసిన అనతరం గ్రామాలలో గుస్సాడి నృత్యాలు చేయడం ఆనవాయితి.
Dandari-Gussadi festival: దీపావళి ముందు పది రోజుల నుండి దీపావళి వరకు జరిగే ఈ దండారి పండుగలో గిరిజనులు చేసే గుస్సాడి నృత్యాలు లయబద్ధంగా ఉంటాయి అదివాసిలలో గోండు తెగ వారిది ప్రత్యేక జీవన విధానం ఒక్కప్పుడు రాజ్యాలను ఏలిన వీరు గిరిజన గుడాలలో తమకంటూ ఒక్క ప్రత్యేక స్థానం ఏర్పరుచుకొన్నారు…కొత్త సంవత్సరం వచ్చిన..కొత్త పండుగ వచ్చిన పంట చేతికి వచ్చిన గిరిజన గుడాలాలో గుస్సాడి నృత్యాలతో పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది..ముఖ్యంగా దీపావళి ముందు వచ్చే దండారి పండుగను గిరిజనులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారు…దండారి పండుగ వెనుక గిరిజనుల కథలు అనేక రకాలుగా ఉన్నాయి…దండారి అంటే డప్పు చాటింపు అని అర్థం..తాము పలానా గుడానికి గుస్సాడి నృత్యానికి వస్తామని గిరిజనులు డప్పు చాటింపు వేయడం ఆనవాయితి..ఆవిధంగా దండారి పండుగను దీపావళి వరకు గిరిజనులు జరుపుకుంటారని స్థానికులు చెపుతున్నారు.