Thalliki Vandanam

Thalliki Vandanam: రేపే ‘తల్లికి వందనం’ నిధుల విడుదల.. నకిలీ లింకులతో జాగ్రత్తగా ఉండాలని అధికారుల హెచ్చరిక!

Thalliki Vandanam: ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. జులై 22వ తేదీ నుంచి ‘తల్లికి వందనం’ పథకం నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. జులై 22 నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా ఈ నగదు పంపిణీ జరగనుంది.

1. ఖాతాల్లో ఎంత జమ అవుతుంది?

ఈ పథకం కింద ప్రతీ విద్యార్థికి ఏటా రూ.15,000 ఆర్థిక సాయం అందిస్తారు. అందులో స్కూళ్లు, కాలేజీల నిర్వహణ, పరిశుభ్రత, మౌలిక వసతుల కల్పన కోసం రూ.2,000 మినహాయించుకుని.. మిగతా రూ.13,000 నేరుగా తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు.

  • పిల్లల సంఖ్యతో సంబంధం లేదు: ఇంట్లో ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పిల్లలు ఎంతమంది ఉన్నా ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తిస్తుంది.

  • మొదటి విడత లబ్ధిదారులు: తొలి విడతలో 41.07 లక్షల మంది తల్లుల ఖాతాల్లో 64.76 లక్షల మంది విద్యార్థులకు గాను నిధులు విడుదల కానున్నాయి. కొత్త అడ్మిషన్లు, రికార్డుల సవరణ పూర్తయ్యాక మొత్తం 67.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.

2. ఎవరికి వర్తిస్తుంది? ఎవరికి వర్తించదు?

  • ఎవరికి వర్తిస్తుంది?: ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, రెసిడెన్షియల్ స్కూళ్లు ఇంకా జూనియర్ కాలేజీల్లో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ఇది వర్తిస్తుంది. సింగిల్ పేరెంట్ కుటుంబాల్లో తండ్రి ఖాతాలో జమ చేస్తారు. అంగన్వాడీ, పారిశుద్ధ్య కార్మికులకు కూడా ఈ పథకం అమలవుతుంది.

  • ఎవరికి వర్తించదు?: ఐటీఐ (ITI), పాలిటెక్నిక్, ఆర్‌జీయూకేటీ (IIIT) చదువుతున్న విద్యార్థులకు విద్యాదీవెన/ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుందున వారికి ఈ పథకం వర్తించదు.

  • అర్హత నిబంధనలు: కుటుంబ నెలసరి ఆదాయం పల్లెటూర్లలో రూ.10,000, పట్టణాల్లో రూ.12,000 మించకూడదు. వైట్ రైస్ కార్డు ఉండాలి. 3 ఎకరాల పల్లం లేదా 10 ఎకరాల మెట్ట భూమి కంటే ఎక్కువ ఉండకూడదు. నెలకు సగటున 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వాడేవారు, ఐటీ రిటర్న్స్ చెల్లించేవారు అర్హులు కారు.

3. సైబర్ దొంగల హెచ్చరిక: నకిలీ లింకులు నమ్మవద్దు!

‘తల్లికి వందనం’ డబ్బుల పేరుతో సైబర్ నేరగాళ్లు స్పామ్ మెసేజ్‌లు, ఫేక్ లింకులు పంపుతున్నారని పోలీసులు, ప్రభుత్వ అధికారులు హెచ్చరిస్తున్నారు.

“మీ ఖాతాలో డబ్బులు పడాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి” లేదా “యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి” అంటూ వచ్చే మెసేజ్‌లపై ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదు.ఇలా ఏదైనా అనుమానాస్పద లింకులు వస్తే వాటిని ఎట్టి పరిస్థితిలోనూ క్లిక్ చేయకండి లేదంటే మీ ఖాతాలో ఉన్న డబ్బులను సైబర్ నేరగాళ్లు దోచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

  • మీ బ్యాంక్ అకౌంట్ నంబర్, ఏటీఎం పిన్ (PIN), ఓటీపీ (OTP) లేదా ఎలాంటి వ్యక్తిగత వివరాలను ఎవరికీ షేర్ చేయవద్దు.

  • ప్రభుత్వం ఎలాంటి వ్యక్తిగత మెసేజ్‌లు, లింకులు పంపదు. సందేహాలు ఉంటే నేరుగా మీ గ్రామా/వార్డు సచివాలయాన్ని లేదా పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని (Headmaster) సంప్రదించాలి అని అధికారులు తెలుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *