Pushpa 2 Making Video: 2024లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ‘పుష్ప-2‘ చిత్రం! డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా సంక్రాంతి కానుకగా కొత్త భారీ చిత్రాలు విడుదలయ్యే వరకూ బాక్సాఫీస్ ను రూల్ చేస్తూనే ఉంది. అతి తక్కువ సమయంలో వరల్డ్ వైడ్ రూ. 1800 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసిన ఇండియన్ మూవీగా రికార్డ్ సృష్టించింది ‘పుష్ప-2’. ఈ సందర్భంగా మూవీని జనవరి 11న అదనంగా మరో 20 నిమిషాల నిడివితో థియేటర్లలో రీ-లోడ్ చేయాలని నిర్మాతలు భావించారు. అయితే సాంకేతిక పరమైన ఇబ్బందుల వల్ల దానిని 17కి వాయిదా వేశారు. ఈలోగా ‘పుష్ప-2’ అభిమానుల కోసం మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ చిత్ర రూపకల్పన వెనుక దర్శకుడు సుకుమార్, కథానాయకుడు అల్లు అర్జున్ పడిన శ్రమ ఏపాటిది అనేది ఈ మేకింగ్ వీడియో చూస్తే అర్థమౌతోంది. విజయాలు ఊరికే దక్కవని దీనిని చూసిన ఎవరైనా చెబుతారు!