Pawan Kalyan: ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సైన్ చేసిన సినిమాలను కంప్లీట్ చేసే పనిలో పడ్డారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలున్నాయి. ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్‌సింగ్’, ‘హరిహరవీరమల్లు’ సినిమాలు ప్రస్తుతం సెట్స్ పైన ఉన్నాయి. త్వరలోనే పవన్ వీటిని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు.
ఇటీవల ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కమెడియన్ యోగిబాబు అంటే తనకు ఇష్టమని చెప్పుకొచ్చారు. ఇటీవల ఆయన నటించిన ఓ సినిమా తాను చూశానని… అందులో సర్పంచిగా యోగి నటన బాగుందని, బాగా నవ్వుకున్నానన్నారు పవన్. ఇక దర్శకుల విషయానికొస్తే.. తనకు మణిరత్నం సినిమాలంటే ఇష్టమన్న పవన్.. లోకేశ్ కనగరాజ్ ఫిల్మ్ మేకింగ్ నచ్చిందన్నారు.
Pawan Kalyan: ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘లియో’, ‘విక్రమ్’ సినిమాలు చూశానని.. బాగున్నాయని కొనియాడారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలో పవన్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తే బాగుంటుందని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. లోకేశ్ చాలా సక్సెస్‍ఫుల్ దర్శకుడిగా ఉన్నారు. తన మార్క్ యాక్షన్ చిత్రాలతో వరుస హిట్‍లు కొడుతున్నారు. స్టార్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు.
Also Read: Salt Usage: ఉప్పు లేనిదే ముద్ద దిగడంలేదా? అనారోగ్యాన్ని ఆహ్వానించినట్టే.. ఎందుకంటే..