Misguided:

Misguided: మార్చిలో ఎంగేజ్‌మెంట్.. సెప్టెంబర్‌లో బ్రేకప్.. అక్టోబర్‌లో ప్యాచ్‌అప్..

Misguided: టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా, టాలీవుడ్ నటి ఆకృతి అగర్వాల్ తమ విభేదాలను పక్కనబెట్టి మళ్లీ ఒక్కటయ్యారు. కొన్ని వారాల క్రితం ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకుని విడిపోతున్నట్లు ప్రకటించిన ఈ ప్రేమజంట, తాజాగా తమ బంధాన్ని కొనసాగించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆకృతి అగర్వాల్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా స్వయంగా వెల్లడించగా, పృథ్వీ షా సైతం ఆ పోస్ట్‌ను రీషేర్ చేసి కన్‌ఫర్మ్ చేశారు. సన్నిహితుల మాటలు విని తొందరపడి నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నానని, పృథ్వీతో మనసు విప్పి మాట్లాడకుండా తీసుకున్న ఆ నిర్ణయం తన తప్పేనని ఆకృతి బహిరంగంగా అంగీకరించారు.

తప్పంతా నాదే.. ఇద్దరం మాట్లాడుకున్నాం.. ఆకృతి ఎమోషనల్ పోస్ట్

ఇతరుల మాటలు విని తప్పు చేశా.. మా రిలేషన్‌షిప్ గురించి మాకంటే ఎక్కువ తెలుసని భావించిన కొందరు సన్నిహితుల మాటల ప్రభావానికి లోనయ్యాను. పృథ్వీతో సూటిగా, నిజాయతీగా మాట్లాడకుండానే నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుని పెద్ద పొరపాటు చేశాను. ఆ నిర్ణయానికి, దానివల్ల అతడికి కలిగిన బాధకు నేనే పూర్తి బాధ్యత వహిస్తున్నాను అని తెలిపారు.
మళ్లీ కలిసి సాగాలని నిర్ణయం..
ఇటీవల ఇద్దరం కూర్చుని అన్ని విషయాలు ఓపెన్‌గా మాట్లాడుకున్నాం. ఒకరినొకరం అర్థం చేసుకున్నాక మళ్లీ కలిసి ప్రయాణించాలని నిర్ణయించుకున్నాం. మా ఇద్దరి ప్రయాణానికి మేమిద్దరం చాలు, వేరే ఎవరి జోక్యం అవసరం లేదు. మా కొత్త ఆరంభాన్ని గౌరవించండి, ఎలాంటి వదంతులు ప్రచారం చేయవద్దు అని కోరారు.
మార్చిలో ఎంగేజ్‌మెంట్.. సెప్టెంబర్‌లో బ్రేకప్.. అక్టోబర్‌లో ప్యాచ్‌అప్..
మార్చి 8న పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్‌ల ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగింది. గ్రౌండ్‌లో సిక్సర్లు కొట్టడం నుంచి జీవితాంతం కలిసి ఉండే ఇన్నింగ్స్ మొదలైంది.. ఈమె నా పర్ఫెక్ట్ ఇన్నింగ్స్  అంటూ పృథ్వీ షా అప్పట్లో ఫోటోలను షేర్ చేశారు.
జులైలో అనుమానాలు – సెప్టెంబర్‌లో బ్రేకప్..
ఐపీఎల్ సమయంలో పృథ్వీ మ్యాచ్‌లకు దూరమవడం, ఆ తర్వాత జులైలో ఆకృతి పెట్టిన కొన్ని పరోక్ష సోషల్ మీడియా పోస్టులు, ఎంగేజ్‌మెంట్ ఫోటోలను డిలీట్ చేయడం తీవ్ర దుమారం రేపాయి. చివరకు సెప్టెంబర్‌లో ఇద్దరి లక్ష్యాలు వేరంటూ విడిపోతున్నట్లు ప్రకటించారు.
తిరిగి చేతులు కలిపిన జంట..
అయితే నెల రోజులు తిరక్కుండానే ఇద్దరూ తమ మధ్య ఉన్న అపార్థాలను తొలగించుకుని తిరిగి ఒక్కటి కావడంతో అభిమానులు, నెటిజన్లు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నటి ఆకృతి అగర్వాల్ ఇటీవల సన్నీ లియోన్, సుమన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన తెలుగు చిత్రం ‘త్రిముఖ’ (Trimukha) లో నటించిన సంగతి తెలిసిందే.
patch up

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *