Mysterious Disease

Mysterious Disease: అంతుచిక్కని వ్యాధికి మరో బాలిక బలి.. ఇప్పటివరకూ ఎంతమంది చనిపోయారంటే.. 

Mysterious Disease: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా బాదల్ గ్రామంలో 9 ఏళ్ల బాలిక బుధవారం రాత్రి మరణించింది. రాజౌరి జిల్లాలో మిస్టరీ వ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య 12 మంది పిల్లలతో సహా 15 కి చేరుకుంది. జమ్మూ కాశ్మీర్ పోలీసులు మరణాలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు.

Mysterious Disease: 2024 డిసెంబర్ 7 – 16 మధ్య బాదల్ గ్రామంలో 2 కుటుంబాలకు చెందిన 9 మంది చనిపోయారు. దీని తరువాత, జనవరి 11 న, మహ్మద్ అస్లాం 6 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. వారిలో 4 మంది మరణించారు. జనవరి 12న పదేళ్ల బాలిక మృతి చెందింది.

Mysterious Disease: జమ్మూ కాశ్మీర్ ఆరోగ్య మంత్రి సకీనా మసూద్ బాదల్ గ్రామంలో జరిగిన ఈ మరణాలకు రహస్య వ్యాధి కారణమని వస్తున్న వార్తలను తోసిపుచ్చారు. కేంద్ర పాలిత ప్రాంతం లోపల, వెలుపల నిర్వహించిన అన్ని పరీక్షల ఫలితాలు ప్రతికూలంగా వచ్చాయని ఆయన చెప్పారు. ఎలాంటి నిర్ధారణకు రాకముందే ఇలా చెప్పలేమనీ, పూర్తిస్థాయి విచారణ జరపాల్సిన అవసరం ఉందని మంత్రి సకీనా మసూద్ అన్నారు. జిల్లా డెవలప్‌మెంట్ కమీషనర్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నానని చెప్పారు.

చనిపోయిన వారి నమూనాలలో న్యూరోటాక్సిన్..

Mysterious Disease: ఈ మరణాలు ఏదో ఒక వ్యాధి వల్ల సంభవించి ఉంటే, ఇది వేగంగా వ్యాపించేదని, కేవలం మూడు కుటుంబాలకే పరిమితం కాదని మంత్రి సకీనా మసూద్ అన్నారు. అయితే మృతుల శాంపిల్స్‌లో ‘న్యూరోటాక్సిన్’ ఉన్నట్లు కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఫోరెన్సిక్ నివేదిక కోసం.. 

Mysterious Disease: పూణేలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), ఢిల్లీకి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC), డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) సహా జాతీయ మరియు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థల సహాయం ప్రభుత్వం తీసుకున్నట్లు ఆరోగ్య మంత్రి తెలిపారు. ఈ పరిశోధనలలో దేనిలోనూ ప్రతికూల ఫలితాలు వెలువడలేదు. నీరు – ఆహార పదార్థాల నమూనాలను కూడా పరీక్షించారు.  అయితే విషపూరిత పదార్థం ఏదీ కనబడలేదు. 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Crime News: ఇంటర్ విద్యార్ధినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *