PM Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైనట్టు తెలిసింది. జనవరి 8న అనకాపల్లి జిల్లాలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు. ప్రధాని చేతుల మీదుగా అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లిలో రూ.లక్షన్నర కోట్లతో నిర్మిస్తున్న స్టీల్ ప్లాంట్, అచ్యుతాపురంలోని ఎన్టీపీసీలో హైడ్రోజన్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
PM Narendra Modi: వాస్తవానికి ప్రధాని మోదీ గత నవంబర్ నెలలోనే అనకాపల్లి జిల్లా పర్యటనకు రావాల్సి ఉన్నది. అదే సమయంలో విశాఖపట్నంలో భారీ బహిరంగసభ నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఆ సమయంలో తుఫాన్ హెచ్చరికలతో పర్యటనను వాయిదా వేశారు. మళ్లీ జనవరి 8న ప్రధాని పర్యటన ఖరారైందని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తాజాగా ప్రకటించారు.