Daku Maharaj: ఇరవై, ఇరవై ఐదు ఏళ్ళుగా బాలకృష్ణ ను ఎవరూ చూపించని విధంగా తాము ‘డాకు మహారాజ్’లో చూపించామని చెబుతున్నారు దర్శక నిర్మాతలు కొల్లి బాబీ, సూర్యదేవర నాగవంశీ. ఎంటర్ టైన్ మెంట్, చైల్డ్ సెంటిమెంట్, యాక్షన్ తో పాటు విజువల్స్ కూడా సరికొత్తగా ఉంటాయని వారు తెలిపారు. శ్రద్థ శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను అనుకున్న విధంగా తీయగలిగానని దర్శకుడు బాబీ చెప్పారు. జనవరి 2న హైదరాబాద్ లో ట్రైలర్ ను, 4న అమెరికాలో ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాటను, 8వ తేదీ విజయవాడ లేదా మంగళగిరిలో గ్రాండ్ ఫంక్షన్ చేస్తామని నిర్మాత నాగవంశీ చెప్పారు. సంక్రాంతి చిత్రాల విడుదల విషయంలో ఏర్పడిన సంక్షోభం ఎఫ్.డి.సి. ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు అమెరికా నుండి రాగానే కూర్చుకుని మాట్లాడి పరిష్కరించుకుంటామని నాగవంశీ చెప్పారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోమవారం మూవీ నుండి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేశారు.
Garividi Lakshmi: వెండితెరపై బుర్రకథ కళాకారిణి జీవితం!
ఉత్తర ఆంధ్రకు చెందిన బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మీ స్ఫూర్తిదాయకమైన జీవితం వెండితెరపైకి ఎక్కబోతోంది. టైటిల్ రోల్ ను ఆనంది ప్లే చేస్తుండగా ‘గరివిడి లక్ష్మీ’చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, ఆయన కుమార్తె కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను గౌరీనాయుడు జమ్మూ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం ఆంధ్రప్రదేశ్ లోని ఆదోనిలో ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి ఎమ్మెల్యే పార్థసారధి క్లాప్ కొట్గా, ఎమ్మెల్సీ మధు, మల్లప్ప నయాకర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. జనవరి మూడోవారం నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆదోనిలో మొదలవుతుందని తెలిపారు. ఈ చిత్రానికి జె ఆదిత్య కెమెరామ్యాన్ కాగా, చరణ్ అర్జున్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీనియన్ నటుడు నరేశ్ కూడా పాల్గొన్నారు.