Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో సీఎం రేవంత్, ఆ తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇకపై సినిమాల ప్రీమియర్ షోకు అనుమతి ఇవ్వమని, టిక్కెట్ రేట్లు పెంచమని చెప్పడంపై రెండు తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్స్ హర్షం వ్యక్తం చేశారు. ది తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిబిటర్స్ సెక్టార్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. సీఎం తీసుకున్న నిర్ణయంతో సింగిల్ థియేటర్లకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఇదే నిర్ణయాన్ని ఆంధ్ర ప్రదేశ్ లోనూ అమలు చేయాలని తెలుగు ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామ్ ప్రసాద్ డిమాండ్ చేశారు. భారీ బడ్జెట్ తో మూవీ నిర్మించామంటూ అత్యధిక టిక్కెట్ రేట్లు పెట్టడం వల్ల ప్రేక్షకులపై భారం పడుతోందని ఆయన అన్నారు. టిక్కెట్ రేట్లు పెంచడం వల్ల చిన్న సినిమాలు చేసే ఆస్కారం మధ్యతరగతి వారికి ఉండటం లేదని బాల గోవింద్ ఆవేదన వ్యక్తం చేశారు.