PM modi:గత ఏడాది కాలంలో తమ ప్రభుత్వం యువతకు రికార్డు స్థాయిలో 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రోజ్‌గార్ మేళా వర్చువల్ కార్యక్రమంలో పాల్గొంటూ ఆయన ఈ విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా 71 వేల మందికి అపాయింట్‌మెంట్ లేఖలు అందించారని తెలిపారు.
గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రధాని స్పష్టం చేశారు. పారదర్శకత కారణంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ వేగంగా పూర్తయిందని చెప్పారు.
రిక్రూట్ అయిన వారిలో ఎక్కువ శాతం మంది మహిళలే ఉన్నారని మోదీ తెలిపారు. 26 వారాల మెటర్నిటీ లీవ్‌ను అమలు చేయడం వలన మహిళలు తమ కెరీర్‌లో మరింత లాభం పొందుతున్నారని వివరించారు. అలాగే, పీఎం ఆవాస్ యోజన కింద ఎక్కువ మంది లబ్ధిదారులు మహిళలేనని, దేశంలో మహిళా కేంద్రీకృత అభివృద్ధి జరుగుతోందని మోదీ పేర్కొన్నారు.
యువత సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం ప్రత్యేకంగా పనిచేస్తోందని ప్రధాని చెప్పారు. అనేక పథకాల రూపకల్పనలో యువతనే కేంద్రంగా పెట్టినట్లు వివరించారు.
ప్రభుత్వ పథకాలు, పారదర్శక విధానాలు, మహిళా సంక్షేమం, యువత నైపుణ్యాల అభివృద్ధి వంటి అంశాల్లో తమ ప్రభుత్వం ముందున్నదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.