Telugu Film Chamber: హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం చాంబర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఈ రోజు సినీ ప్రముఖుల కీలక సమావేశం జరుగుతున్నది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సినిమా పరిశ్రమపై చేసిన కీలక వ్యాఖ్యలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నది. అదే విధంగా ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై దాడి, టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
Telugu Film Chamber: అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని, టికెట్ రేట్లు పెంచబోమని తేల్చి చెప్పేశారు. ఈ సమావేశానికి పలువురు నిర్మాతలు, ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లు హాజరయ్యారు. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కూడా ప్రత్యేకంగా సమావేశం కానున్నది. సాయంత్రం ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో హాస్పిటల్‌లో చికి్తస పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌కు ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు తెలంగాణ ఫిలిం చాంబర సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.