India vs England

India vs England: భారత్ vs ఇంగ్లాండ్ : అరుదైన రికార్డులు బద్దలుకొట్టడానికి ఆటగాళ్లు రెడీ

India vs England: భారత్ – ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్ అయినప్పటికీ ఇంగ్లాండ్ సిరీస్ టీమిండియాకు చాలా ప్రత్యేకమైనది. ఈ సిరీస్ ద్వారా పలువురు ఆటగాళ్ళు అరుదైన మైలురాళ్లను చేరుకోనున్నారు. 2025 జూన్ నుండి ఆగస్టు వరకు జరిగే ఈ సిరీస్ హెడింగ్లీ, ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్, ది ఓవల్, ఓల్డ్ ట్రాఫోర్డ్‌ స్టేడియాలల్లో జరుగుతుంది.

గిల్, జైస్వాల్ 2000 పరుగులు
శుబ్‌మాన్ గిల్ కు 2000 టెస్ట్ పరుగులు పూర్తి చేయడానికి ఇంకా 107 పరుగులు అవసరం. 2000 టెస్ట్ పరుగులు చేరుకోవడానికి జైస్వాల్‌కు 202 పరుగులు అవసరం. ఐదు టెస్టులు కాబట్టి ఈ రికార్డులను వీరు అందుకోవడం చాలా సులభం. ఇక ఈ సిరీస్‌లో అందరి దృష్టి కెప్టెన్ గిల్‌పైనే ఉంది.

ఇది కూడా చదవండి: Suryakumar Yadav: నో మ్యాచులు..గ్యాప్ ను వాడుకుంటున్న సూర్య కుమార్ యాదవ్..

9,000 పరుగుల ట్రాక్‌లో రాహుల్
9,000 పరుగులకు కేఎల్ రాహుల్ కేవలం 435 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇంగ్లాండ్‌లో మంచి ప్రదర్శన ఇవ్వాలనే లక్ష్యంతో ఉన్నాడు. రాహుల్ మంచి ఫామ్ లో ఉండడంతో ఈ ఘనత అందుకోవడం చాలా ఈజీ అని చెప్పొచ్చు. రిషబ్ పంత్ 3,000 టెస్ట్ పరుగులకు కేవలం 52 పరుగుల దూరంలో ఉన్నాడు. అతను వైస్ కెప్టెన్‌గా జట్టులోకి తిరిగి వస్తున్నాడు.

జడేజా & సిరాజ్ మైలురాళ్ళు
రవీంద్ర జడేజా 7,000 అంతర్జాతీయ పరుగులకు 309 పరుగుల దూరంలో ఉన్నాడు. మహ్మద్ సిరాజ్ 200 అంతర్జాతీయ వికెట్లకు 15 వికెట్ల దూరంలో ఉన్నాడు. వీరు సైతం ఈ సిరీస్ లో ఈ రికార్డులను నమోదు చేయడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Ambati Rayudu: మాట మార్చిన అంబటి రాయుడు.. RCB ని పొగడ్తలతో ముంచేశాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *